Wednesday, May 8, 2024

ఫన్నీగా ‘జాతిర‌త్నాలు’ టీజర్..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘జాతిర‌త్నాలు’. ఈ సినిమాలో నవీన్ తోపాటు కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శిలు కూడా జాతిరత్నాలుగా నటిస్తున్నారు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్ ఈ చిత్రం నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో కొత్త అమ్మాయి ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తుంది. దర్శకుడు అనుదీప్ కె.వి ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఫన్నీగా ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కాగ, ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది.

Jathi Ratnalu movie teaser released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News