Sunday, April 28, 2024

నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: భట్టి

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చినట్టుగానే..  మరమగ్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత కరెంటు ఇస్తామని సిఎల్పి నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. శుక్రవారం పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బీబీనగర్ మండలం గొల్లగూడెం, మగ్ధుంపల్లి, చిన్న పలుగుతండా, పెద్ద పలుగు తండా, గుర్రాల దండి, భట్టుగూడెం పెద్ద రావులపల్లి గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పాదయాత్రకు ప్రజలు అడుగడుగున స్వాగతం పలుకుతూ మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రజలను ఉద్దేశించి భట్టి విక్రమార్క ప్రసంగించారు. ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అవసరం కావడంతో గుడ్డలను తయారు చేయడానికి నేతన్నలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాలోనే నూలు వడికే చెరకు ఉందని, కాంగ్రెస్ పార్టీకి నేతఅన్నలకు విడదీయని అనుబంధానికి ఇదే సంకేతమని చెప్పారు.

Also Read: కర్ణాటకలో మతతత్వ పూనకం!

గత ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన భూములను బలవంతంగా గుంజుకుంటే ఖబర్దార్ అని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న మిగులు భూములు అన్నింటిని పేదలకు పంచుతామని, అసైన్డ్ కమిటీలను తిరిగి పునరుద్ధరణ చేస్తామని ప్రకటించారు. గీత కార్మికులు తాటి చెట్లు ప్రతిరోజు ఎక్కి, దిగడం వారికి పునర్జన్మనేని, ఇంతటి ప్రమాదకరమైన వృత్తిని కొనసాగిస్తున్న గీత కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గీత కార్మికులకు ప్రమాద బీమా ప్రీమియం డబ్బులని ప్రభుత్వం పూర్తిగా చెల్లించి తాటి చెట్టు పైనుంచి పడిన కార్మికులకు ప్రమాద బీమా వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారు.

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో బునాది గాని కాలువ పనులు మొదలుపెట్టినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం పూర్తి చేయకపోవడం అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. బునాది అని కాల్వ విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం తోనే రాష్ట్ర భవితవ్యం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని భట్టి హామీ ఇచ్చారు. ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకొని టిఎస్పిఎస్ సి ద్వారా పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని భట్టి వెల్లడించారు. కెజి నుంచి పిజి వరకు ఇంగ్లీష్ మీడియంలో ఉచితంగా నిర్బంధ విద్యను అందిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల వరకు మెరుగైన వైద్యం అందించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News