Monday, April 29, 2024

ఐటి హబ్ ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేటలో ఐటి హబ్ ఏర్పాటు చేయడంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట శివారులోని నాగుల బండ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఐటి హబ్‌ను ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి సందర్శించి అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 13 న జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్వన్ హాల్‌లో 11 కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు.

దీంతో ప్రత్యక్షంగా 750 మంది స్ధానిక యువతకు పరోక్షంగా మరో కొంత మందికి ఉపాధి అవకాశం లభిస్తుందన్నారు. ఈ నెల 15న ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ఈ ఐటి హబ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట ఐటి హబ్‌లో నిరంతరం 150మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి 45 రోజులకు ఒకసారి ఒక బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఐటిహబ్ ప్రారంభానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట టిఎస్‌ఐఐసి జోనల్ మేనేజర్ మాధవి, ప్రజాప్రతినిధులు, నాయకులు కడవేర్గు రాజనర్సు, పాల సాయిరాం, దేవునూరి చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News