Thursday, May 9, 2024

పాతకక్షల నేపథ్యంలో జర్నలిస్ట్ హత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: పాతకక్షల నేపథ్యంలో ఓ జర్నలిస్టును హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సోన్ బద్రా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బర్వాడి గ్రామంలో ఉదయ్ పాశ్వాస్ అనే జర్నలిస్టు హిందీ డెయిలీ పత్రికలో పని చేస్తున్నాడు. వారం రోజుల క్రితం తనకు, తన కుటుంబానికి గ్రామ మాజీ సర్పంచ్ నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సదరు జర్నలిస్ట్ కు రక్షణ కల్పించలేదు. నవంబర్ 16న తన భార్య శీతలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. కానీ పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో నడి రోడ్డుపై స్థానికులు చూస్తుండగా ఆరుగురు వ్యక్తులు కర్రలు కత్తులతో ఉదయ్, ఆయన భార్యపై దాడి చేశారు. ఈ దాడిలో ఉదయ్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా ఆయన భార్య తీవ్రంగా గాయపడింది, ఉదయ్ కుమారుడు వినయ్ ఫిర్యాదు మేరకు నిందితులు గ్రామ మాజీ సర్పంచ్ కేవల్ పాశ్వన్, భార్య కౌశల్య, జితేంద్ర, గబ్బర్, సికేందర్, అనుచరుడు ఇక్లాక్ అస్లామ్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని జిల్లా ఎస్‌పి అశిష్ శ్రీవాత్సవ్ తెలిపాడు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన సిఐ, ఎస్‌ఐ తో పాటు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News