Saturday, April 27, 2024

ఇక్కడ ఉత్తరాది వ్యూహం ఊతమివ్వదు

- Advertisement -
- Advertisement -

దక్షిణాది కేంద్రంగా వ్యూహాలు రచించాలి
యెడియూరప్ప వంటి బలమైన నాయకులు లేకపోవడం శాపం
పార్టీ మూల సిద్ధాంతాన్ని కొనసాగించడమే ఉత్తమ మార్గం
శ్యాం ప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ భోదనలే శిరోధార్యం
ఉత్తరాది కన్నా భిన్నమైన అనుసరించాలి
ఔట్‌లుక్ ఇంటర్వూలో రాష్ట్ర బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణ సాగర్ రావు

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ విజయాలను తెచ్చిపెట్టిన కయ్యానికి కాలుదువ్వడం, రాజకీయ, కుల సమీకరణాలు లాంటి వ్యూహాలు దక్షిణాదిలో పని చేయవని తెలంగాణ బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణ సాగర్ రావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల రాజకీయాల్లో బలంగా కాలు మోపాలంటే ఉత్తరాదిలో అనుసరించిన తన వ్యూహాన్ని పార్టీ పునర్నిర్మించుకోవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కర్నాటకలో కులపరంగా, జనంలో గట్టి పట్టు ఉన్న మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్పలాంటి బలమైన నాయకుడు పార్టీలో ఉండడం ఆ పార్టీ అదృష్టం. ఆ కారణంగానే అది ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగింది. అయితే ద్రవిడియన్ సిద్ధాంతానికి కేంద్రంగా ఉన్న దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ యువ నాయకులు పార్టీలో లేకపోవడం బిజెపికి పెద్ద లోటుగా తయారైంది. ఈ కారణం చేతనే మిగతా దక్షిణాది రాష్ట్రాలయిన తమిళనాడు, తెలంగాణ, ఎపిలలో అది బలమైన పార్టీగా తయారు కాలేకపోతోంది. త్వరలో అంటే వచ్చే ఏడాది కర్నాటక, తెలంగాణలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ‘ఔట్‌లుక్’ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో కృష్ణ సాగర్ రావు ఈ రాష్ట్రాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల గురించి తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు బలమైన నాయకుడు, కాంగ్రెస్ సిట్టింగ్ ఎంఎల్‌ఎ కోమటి రె డ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడంతో పాటుగా, పలువురు నేతలకు కాషాయ కండువాలు కప్పిన విషయం తెలిసిందే. అదే ఊపులో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొంత మంది ఎంఎల్‌ఎలను కూడా పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నించడం, అది బెడిసి కొట్టడం తెలిసిందే. ఈ వ్యవహారాన్నేప్రధాన ఎన్నికల అస్త్రంగా మలుచుకున్న టిఆర్‌ఎస్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించడం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదగాలన్నా, అధికారంలోకి రావాలన్నా అది ఉత్తరాది రాష్ట్రాల్లో అనుసరించిన ప్రధాన వ్యూహమైన రాజకీయ , కుల సమీకరణల విధానాన్ని వదులుకొని సంఘ్‌పరివార్ రాజకీయ స్వరూపమయిన పాత జనసంఘ్ (ప్రస్తుత బిజెపి) వ్యవస్థాపకులయిన శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్‌లు అనుసరించిన, బోధించిన సైద్ధాంతిక ప్రచారానికి మళ్లాల్సిన అవసరం ఉందని కృష్ణ సాగర్ రావు అభిప్రాయపడ్డారు. ‘దక్షిణాదిని మాకు అనుకూలంగా మలిచేందుకు ఏం చేయాలనే బాధ్యతను నాకు గనుక ఇచ్చినట్లయితే నేను ముందుగా పార్టీ మూల సిద్ధాంతాన్ని ఎంచుకొంటాను. ఎందుకంటే అది చాలా గొప్పదే కాకుండా సమాజాన్ని చీల్చేది కాదు. చీల్చేదని నేను అనను కానీ, ఒక రకమైన భావోద్వేగ ఆవేశంతో జనాన్ని తన వైపునకు తిప్పుకోవడం అని దాన్ని చెప్పవచ్చు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఇది బాగా పని చేసింది’ అని ఆయన అన్నారు. అంతేకాదు దక్షిణాదిలో రాజకీయాలు చాలా సున్నితమైన అంశాలపై ఆధారపడి ఉంటుందే తప్ప బహిరంగ ప్రసంగాల వల్ల అక్కడ పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉత్తరాదిలో ఎక్కువ ముస్లింల దాడులు జరిగే.. అలాగే బ్రిటీష్ వాళ్లు దీన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలన సాగించారు. అయితే దక్షిణాదిలో బ్రిటీష్ వాళ్లు సంస్థానాలు సొంతంగా పనిచేయడానికి అనుమతించారు. ముఖ్యంగా తెలంగాణ మహారాష్ట్ర, కర్నాటకలోకి కూడా విస్తరించింది. ఇక్కడ బ్రిటీషర్ల ప్రభావం ఉంది. అందుకే మేము విద్యను ప్రాధాన్యంగా ఎంచుకున్నాం. ఇది పార్టీకి కొంత అడ్డంకి సృష్టిస్తోందని అని అన్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లు గెలుచుకోవాలన్నది బిజెపి లక్షమని, అయితే అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందని, ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికీ రాష్ట్రంలో బలంగానే ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 35 నుంచి 36 శాతం ఓట్లు సాధించాలన్నది మా లక్షమన్నారు. తెలంగాణలో దాదాపు 45 శాతం సీట్లు పట్టణ ప్రాంతా ల్లోనే ఉన్నాయని, ఈ స్థానాలను లక్షంగా పెట్టుకుని పనిచేస్తే తాము విజయం సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఆ దిశగా పార్టీ అధినాయకత్వం వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముఖర్జీ, ఉపాధ్యాయ్‌ల నాయకత్వాన్ని గుర్తు చేసిన కృష్ణ సాగర్ రావు ఉత్తరాదికన్నా భిన్నమైన రీతిలో దక్షిణాదిలో పార్టీ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 1951లో భారతీయ జనసంఘ్‌ను స్థాపించింది ముఖర్జీ అయితే దాని ప్రధాన సిద్ధాంత కర్త ఉపాధ్యాయ్. వీరిద్దరూ సంఘ్ నరివార్‌కు చెందిన వారు. ‘ వీరిద్దరూ కూడా గొప్ప దేశ భక్తులు, నెహ్రూ కేబినెట్‌లో ముఖర్జీ మంత్రిగా కూడా పని చేశారు. ఆయన దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని సవాలు చేయడానికి ఆయన అక్కడికి వెళ్లారు. ఆయన హిందూయిజం కోసం పని చేయలేదు, దేశం కోసం.. జాతీయత కోసం పని చేశారు. ఇక ఉపాధ్యాయ్ సమగ్ర మానవతావాదం గురించి ప్రబోధించారు’ అని ఆయన అన్నారు.

K Krishna Saagar Rao Special Interview

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News