Saturday, April 27, 2024

ఘనీ కన్నా తాలిబన్ల అధీనంలోనే కాబుల్ మెరుగ్గా ఉంది

- Advertisement -
- Advertisement -

Kabul's situation better under Taliban: Russia

రష్యా రాయబారి వ్యాఖ్యలు

మాస్కో: అష్రఫ్ ఘనీ నేతృతృంలోని అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో పోలిస్తే తాలిబన్ల కింద కాబుల్‌లో పరిస్థితి మెరుగ్గా ఉందని రష్యా పేర్కొంది. రష్యాలో తాలిబన్‌ను ఉగ్రవాద సంస్థగా ఇప్పటికీ అధికారికంగా పరిగణిస్తున్నప్పటికీ అఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు చేజిక్కించుకున్న నేపథ్యంలో వారికి రష్యా మద్దతునిచ్చే సూచనలు కనిపిస్తున్నట్లు మాస్కోకు చెందిన ఎకో మోస్క్‌వీ రేడియో వ్యాఖ్యానించింది. తాలిబన్ల ఆక్రమణలోకి కాబుల్ వచ్చిన మొదటిరోజు పరిస్థితిని బట్టి చూస్తే కాబుల్‌లో పరిస్థితి అష్రఫ్ ఘనీ ప్రభుత్వంతో పోలిస్తే పరిస్థితి మెరుగ్గా ఉందని అఫ్ఘన్‌లోని రష్యా రాయబారి డిమిట్రీ జిర్నోవ్ పేర్కొన్నట్లు రేడియో తెలిపింది.

కాబుల్‌లోకి ప్రవేశించిన సమయంలో తాలిబన్లు నిరాయుధులుగా ఉన్నారని, విదేశీ దౌత్య కార్యాలయాల భద్రతపై వెంటనే వారు భరోసా ఇచ్చారని ఆయన అన్నట్లు రేడియో తెలిపింది. దొంగలు, నేరస్థులు లేదా బందిపోట్లు దాడులు చేస్తే వెంటనే తమకు తెలియచేయాలంటూ తాలిబన్లు అక్కడి ప్రజలకు హాట్‌లైన్ ఫోన్లు అందచేయడాన్ని బట్టి చూస్తే వారు నేరాలకు పాల్పడేందుకు రాలేదని అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించినట్లు రేడియో తెలిపింది. కాబుల్‌లో పరిస్థితి ప్రశాంతంగా, మెరుగ్గా ఉందని రష్యా రాయబారి అన్నట్లు రేడియో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News