Monday, April 29, 2024

కోటి ఎకరాల మాగాణం… తెలంగాణ కల సాకారం…

- Advertisement -
- Advertisement -

శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం

సమర్థవంతంగా నదీజలాల వినియోగం

NGT to Hearing on Kaleshwaram extension Works

 

 నీళ్లు ..నిధులు ..నియామకాలే లక్షంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం సాగునీటి రంగానికి ప్రధమ ప్రాధాన్యతనిచ్చి ఆదిశగా సాగునీటి పథకాల నిర్మాణ పనులను పరుగులు తీయించింది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని, కరువుని, వలసలను నివారించడానికి సాగునీటి సౌకర్యం అత్యవసరమని కెసిఆర్ ప్రభుత్వం భావించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని సోర్సుల ద్వారా కనీసం ఒక లక్ష ఎకరాలకు సాగునీరు, మొత్తంగా రాష్ట్రంలో ఒక కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గో దావరి మరియు కృష్ణ రెండు ప్రధాన నదులు. రెండు నదు ల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 1266.94 టిఎంసీల (గోదావరి నదిలో 967.94 టిఎంసిలు, కృష్ణా నదిలో 299 టిఎంసిలు)నీటి కేటాయింపులు ఉన్నాయి. కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణకు 575 టిఎంసిల నీటి కేటాయింపులు జరపాలని వాదిస్తున్నది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ కేటాయింపులు సక్రమంగా వినియోగించక పోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో 125 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిచ్చిం ది. నిర్ణీత లక్ష్యాన్ని సాధించడానికి తెలంగాణ ప్రభుత్వం 6 అంచెల వ్యూహాన్ని అవలంబించింది. సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం, నాగార్జున సాగర్, నిజాం సాగర్, శ్రీ రా మ్ సాగర్ ఇతర మధ్య తరహా ప్రాజెక్టులను దశలవారీగా ఆధునీకరించడం,మిషన్ కాకతీయ’ కింద రాష్ట్రంలోని అన్ని చిన్న నీటిపారుదల జలాశయాలు, నీటి వనరుల పునరుద్ధరణ. ప్రాజెక్ట్ కమాండ్ ఏరియాల గుండా ప్రవహించే వాగులు మరియు నదుల పునరుజ్జీవనం కోసం ప్రాజెక్టుల కాలువలపై తూములను మరియు చెక్ డ్యామ్ ల నిర్మాణం ద్వారా చిన్న నీటిపారుదల జలాశయాలను భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో అనుసంధానం చేయ డం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి రా ష్ట్రంలోనే ఆమోదం పొందిన పాలమూరు రంగారెడ్డి, డిం డి, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టడం. మెరుగైన నీటి వినియోగ సామర్థ్యం, పంట ఉత్పాదకతను సాధించడానికి నీటిపారుదల వ్యవస్థల సమర్థవంతమైన ఆపరేషన్, నిర్వహణ వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి సమగ్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా అన్నిరకాల నీటిపారుదల వనరులను 19 ప్రాదేశిక (ఈఎన్‌సి/సిఈ) అధికార పరిధిలోకి తీసుకువచ్చింది. తెలంగాణలోని మారుమూల గ్రామాలకు సాగునీరు అందించి ప్రజల హృదయాలను తెలంగాణ ప్రభుత్వం గెలుచుకున్నది. తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల రంగంలో అనుసరించిన వినూత్న విధానం దేశంలోనే కాక ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు సమపార్జించింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, తర్వాత ప్రధాన సూచికలు పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గడిచిన 2004 నుంచి 2014 వరకు పదేళ్లలో ప్రాజెక్టులకు రూ.38 వేల 405 కోట్లు సాగునీటి రంగానికి ఖర్చు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2022 వరకు ఎనిమిదేండ్లలో ప్రభుత్వం సాగునీటి రంగానికి రూ. 1 లక్ష 28 వేల 596 కో ట్ల వరకు ఖర్చు చేసింది. 200 4 నుంచి 2014 వరకు పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల సా మర్ధ్యం 5 లక్షల 71 వేల ఎకరాలు మాత్రమే కాగా, తెలంగాణ ఏర్పడ్డాక ఏడేండ్లలో కొత్తగా 15 లక్షల ఎకరాలు పెరిగింది. ప్రాజెక్టులు పూర్తయితే మరో 52.64 లక్షల ఎకరాల సా మర్ధ్యం పెరుగుతుంది.

Govt has allocated Rs 450 cr under the kaleshwaram tourism circuit

ఉమ్మడి రాష్ట్రంలో చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలు, తక్కువ సామర్థ్యంతో నిర్మించేవా రు. భారీ ప్రాజెక్టులు మొదలుపెట్టినా, పూర్తికాలేదు. తె లంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని భారీ ప్రాజెక్టులే నిర్మించింది. వాటిలో కాళేశ్వరం (18.25 లక్షల ఎకరాలు), సీతారామ ( 3.87 లక్షల ఎకరాలు), దేవాదుల (5.58 లక్షల ఎకరాలు), భీమా (2.03 లక్షల ఎకరాలు), కల్వకుర్తి (4.24 లక్షల ఎకరాలు), నెట్టెంపాడు ( 2 లక్షల ఎకరాలు) ప్రాజెక్టులు చేపట్టింది. వీటిలో కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరికొన్ని ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. పాలమూరు – రంగారెడ్డి (12 లక్షల 30 వేల ఎకరా లు), డిండి (3.61 లక్షల ఎకరాలు) ప్రాజెక్టులు పూర్తికావస్తున్నాయి. ఆనాడు ఉమ్మ డి రాష్ట్రంలో నీటిపారుదల సమస్యలు వస్తే, తాత్కాలిక మరమ్మతులు మాత్ర మే చేపట్టే వారు. నేడు తెలంగాణలో శాశ్వత పను లు చేపడుతున్నారు. 27, 665 జలాశయాలు పునరుద్ధరించింది. వీటికోసం రాష్ట్ర ప్రభు త్వం రూ.5,349 కోట్లు ఖర్చుచేసింది. కొత్తగా 15 లక్షల ఆయకట్టు స్థిరీకరించడం జరిగింది. చెరువుల్లో 9 టీఎంసీల నిల్వ సామర్థ్యం పెరిగింది. కట్టలు పటిష్టమై భారీ వర్షాలను త ట్టుకుంటున్నాయి. ఉమ్మడి పాలనలో ఉపాధిహామీ పథ కం కింద సాగునీటి కాల్వల పనులు చేయించలేదు. తెలంగాణలో ఉపాధి హామీ కింద 2.92 కోట్ల పనిదినాల్లో కాల్వల పూడికతీత పనులు చేపట్టడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో చెక్ డ్యాముల నిర్మాణాలు తక్కువ. తెలంగాణలో రూ.5 వేల కోట్లతో చెక్ డ్యాములు చేపట్టారు.

Flood water flows to Kaleshwaram Project

మొ త్తం 1200 చెక్ డ్యాములు నిర్మిస్తుండగా, వీటిలో 638 ప నులు చేపట్టగా, మిగతా 562 పనులు జరగాల్సి ఉన్నది. నాడు సమైక్య రాష్ట్రంలో సాగునీటి సామర్థ్యం వి నియో గం తక్కువ. దాదాపు 60 లక్షల ఎకరాలకు బదు లు కేవ లం 20 లక్షల ఎకరాలకే సాగునీరందేది. నేడు తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ, కొత్తగా కాళేశ్వ రం ప్రాజెక్టును నిర్మించడం వల్ల 2022 నాటికి 85.89 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. దీంతో తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రంగా అవతరించింది. ఎఫ్.సి.ఐ. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచింది.

గతంలో భూగర్బ నీటి వనరుల పెం పు ఏమాత్రం జరగలేదు. కానీ, తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల ద్వారా భూగర్భ నీటిమట్టం 4 మీటర్లకు పైగా పెరిగింది. ఆనాడు చేపల పెంపకం పట్ల అప్పటి ప్రభుత్వం నిర్లక్షత కనబరిచింది.నేడు కెసిఆర్ ప్రభుత్వం ఈ రంగం పట్ల ప్రత్యేక దృష్టిసారించటంతో మత్స్య వనరుల కల్పనలో దేశంలోనే తెలంగాణ 3వ స్థా నంలో, ఉత్పత్తిలో 8వ స్థానంలో నిలిచింది.ఉమ్మడి రా ష్ట్రంలో 2013 వరకు చేపల ఉత్పత్తి విలువ 2,638 కోట్లు ఉండగా, స్వరాష్ట్రంలో 2021 నాటికి రెట్టింపై 5,229 కో ట్ల విలువకు చేరుకున్నది. ఎక్కడికక్కడ మినీ ట్యాంక్ బం డ్‌ల రూపకల్పన పర్యాటకరంగం అభివృద్ధి చెందింది. నా డు తాగునీటి కోసం ఎటువంటి ప్రత్యేక పథకాలు చేపట్టలేదు. నేడు మిషన్ భగీరథ కింద ప్రాజెక్టుల నీటి నిల్వ లో 10శాతం కేటాయించారు. దేశంలో ప్రతి ఇంటికీ సు రక్షిత తాగునీటి సౌకర్యం కల్పించిన రాష్ట్రాల్లో తెలంగా ణ ప్రథమస్థానంలో నిలిచింది. ఉమ్మడి పాలనలో సాగునీటిరంగంలో సమాచార,సాంకేతిక వినియోగం జరగ లే దు. స్వరాష్ట్రంలో ఇంటర్నెట్ వాడకం జరుగుతున్నది. క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ అప్లికేషన్స్, జియో సెన్సిం గ్ సాం కేతికత వల్ల క్యాచ్ మెంట్ ఏరియా సమాచారం, రిజర్వాయర్ల స్థితిగతులు, ఆయకట్టులో పంటల వివరాలు, ప్రాజెక్టులు,చెరువులసమాచారం, వరదముంపు మ్యా పు ల వి వరాలు అందుతున్నాయి. డెసిషన్ సపోర్ట్ సిస్ట మ్ ఏ ర్పా టు చేయడంతో కాళేశ్వరం ప్రాజెక్టును సమర్ధవంతం గా నిర్వహించడానికి వీలు కలుగుతున్నది.సీఈ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైంది. తక్షణ మరమ్మతులు చేపట్టడానికి ఈఎన్సీ నుంచి డీఈఈ వరకు ఆర్ధిక అధికారాలిచ్చిన ప్రభుత్వం, రూ.280కోట్లు కేటాయించింది. 2021 వరకు, ప్రతిపాదిత 125.34 లక్షల ఎకరాలలో 72. 70 లక్షల ఎకరాలకు నీటి సదుపాయం కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News