Monday, April 29, 2024

చై-సామ్‌ విడాకులకు అతనే కారణం: కంగనా రనౌత్

- Advertisement -
- Advertisement -

Kangana Tweet on Chaitanya and Sam Divorce

ముంబయి: నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు హాట్ టాపిక్ అయ్యింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరరు విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై అటు సమంత కానీ, ఇటు చైతన్య కానీ స్పందించలేదు. ఉన్నట్టుండి నిన్న ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా మేము విడిపోతున్నామని వెల్లడించారు. తాజాగా వీరి విడాకులపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ”ఏ జంట విడాకులు తీసుకున్నా.. దానికి పురుషుడే కారణం. దీనిని చెప్పడం మీకు సంప్రదాయవాదంగా లేదా తీర్పులా అనిపించవచ్చు. ఎందుకంటే దేవుడు స్త్రీ, పురుషులను అలాగే సృష్టించాడు. మహిళలను బట్టల్లా మార్చుకుని, వారిని మీ బెస్ట్ ఫ్రెండ్ అని పిలిచే వారిపై జాలి చూపడం ఆపండి. వందలో ఒక మహిళ తప్పు కావచ్చు, కానీ పూర్తిగా కాదు. విడాకుల సంస్కృతి రోజురోజుకీ ఎప్పుడులేనంతగా బాగా పెరిగిపోతుంది. ఇటీవల ‘విడాకుల నిపుణుడు’ బాలీవుడ్ సూపర్ స్టార్(అమీర్ ఖాన్‌)ను కలిసిన తర్వాతనే వారి విడాకులు జరిగాయి” అని కంగనా చెప్పుకొచ్చింది.

Kangana Tweet on Chaitanya and Sam Divorce

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News