Monday, April 29, 2024

అన్నా… వదినకు ఆ ఛాన్సిస్తావా?

- Advertisement -
- Advertisement -

Kavitha tweet to KTR

 

హెయిర్ కటింగ్‌పై ఆసక్తికర ట్వీట్
సోషల్ మీడియాలో వైరల్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు చెల్లి కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా సూపర్ పంచ్ ఇచ్చారు. ఈ ఇద్దరి మధ్య ట్విట్టర్‌లో ఆసక్తికరమైన చర్చ జరగడంతో ఈ చర్చను నెటిజన్స్ అత్యంత ఆసక్తిగా గమనించి పోస్టులు, లైక్‌లు చేస్తున్నారు. కెటిఆర్ ఎప్పుడూ ట్విట్టర్‌లో ఎంతో బిజిగా ఉంటారు. అనేక సమస్యలకు తక్షణం స్పందించి పరిష్కరించడం కెటిఆర్‌కు నిత్యకృత్యం. సమస్యలు పరిష్కరించడమే కాకుండా నెటిజన్స్ అడిగే వెరైటి ప్రశ్నలకు పంచ్‌లు వేస్తుంటారు. ఇలా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు పంచ్ వేస్తూ కెటిఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా చెల్లి కవిత ట్విట్టర్‌లో కెటిఆర్‌ను అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్లితే ఏప్రిల్ 20 తర్వాత హెయిర్ కటింగ్ షాపులు తెరిచే సూచనలు ఉన్నాయా, హెయిర్ కటింగ్ షాపులు తెరవని పక్షంలో తన భార్య హెయిర్ కటింగ్ చేస్తానని అంటోందని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఈ సందర్భంగా కెటిఆర్ స్పందిస్తూ ఆసక్తి కరమైన సమాధానం ఇచ్చారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆయన భార్య అనుష్క శర్మ హెయిర్ కటింగ్ చేశారు. అలాంటప్పుడు నీవెందుకు చేయించుకోవని ఫన్నీగా కెటిఆర్ సమాధానం ఇచ్చారు. అయితే ఈ సంభాషణలోకి కల్వకుంట్ల కవిత ప్రవేశించడంతో చాటింగ్ ఆసక్తిగా మారింది. నెటిజన్‌కు కెటిఆర్ ఇచ్చిన సమాధానం ట్విట్టర్‌లో చూసిన కవిత అన్నయ్య వదినకు కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నావా? అంటూ ట్వీట్ చేయడంతో వైరల్ అయింది. అన్నా చెల్లి సంభాషణలకు అభిమానుల లైక్‌లు పడుతూనే ఉన్నాయి.

తల్లిలేని పిల్లలకు ఆపన్నహస్తం అందించిన కెటిఆర్
హైదరాబాద్ ఎర్రగడ్డ సమీపంలోని ప్రేమ్‌నగర్ కాలనీలో ఒక నిరుపేద కుటుంబంలోని పిల్లలకు అనుకోని కష్టం వచ్చింది. భర్త బయటకు వెళ్లి కూలి చేసుకుని సంపాదిస్తే తల్లి పిల్లలను సాకేది. అయితే ఆనారోగ్యంతో తల్లి మరణించడంతో పాటు తండ్రికి కూలీ పనులు లేక పస్తులతో జీవిస్తున్న విషయం కెటిఆర్‌కు తెలిసి తక్షణం స్పందించారు. స్థానిక శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్‌కు సమాచారం అందించగా తక్షణం గోపినాథ్ వెళ్లి పిల్లలకు కావల్సిన పాలు, కుటుంబానికి కావల్సిన సరుకులు ఇచ్చారు. ఎలాంటి సమస్యవచ్చినా తన దృషికి తీసుకు రావాలని చెప్పడంతో ఆ కుటుంబం ఆకలి బాధ నుంచి బయట పడింది.

Kavitha tweet to KTR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News