Saturday, May 4, 2024

మతం పేరిట చిచ్చు పెడితే… సహించేదే లేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సభ నిర్వహిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28న సాయంత్రం నాలుగు గంటలకు ఎల్‌బి స్టేడియంలో సిఎం కెసిఆర్ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. మా రోడ్‌షోలకు జనం నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు. గ్రౌండ్ ప్లాన్, సభా వేదిక ప్లాన్‌ను  పోలీసులకు కెటిఆర్ వివరించారు.

జిహెచ్‌ఎంసి లో 150 డివిజన్ల నుంచి ప్రజలు రావాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి టిఆర్‌ఎస్‌తోనే సాధ్యమైందన్నారు. మా రోడ్ షోలకు జనం నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు. హైదరాబాద్ సోదర, సోదరీమణులంతా సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ప్రజల మధ్య మతం పేరిట చిచ్చు పెడతామంటే ఎవరైనా సహించేది లేదని, శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ఎవరెంత రెచ్చగొట్టినా తమదే విజయమన్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఏ పార్టీ వారైనా, ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని సిఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News