Friday, May 3, 2024

అంధకారమన్న చోట… వెలుగులు నింపాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం అవుతుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని మంత్రి కెటిఆర్ తెలిపారు. కొత్త పెట్టుబడులు రావని, ఉన్న పరిశ్రమలు పోతాయని శాపనార్థాలు పెట్టారని గుర్తు చేశారు. ఆరు నెలల్లోనే సిఎం కెసిఆర్ కరెంట్ సమస్యను పరిష్కరించారని, విద్యుత్‌లో ఉత్పత్తిలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడంతో పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. నిజాంక్లబ్‌లో విశ్వనగరంగా హైదరాబాద్ చర్చలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. హైదరాబాద్ 430 సంవత్సరాల చరిత్ర కలిగిన నగరమన్నారు.

పురాతన కట్టడాలు, ఆధునిక నిర్మాణాల కలబోత హైదరాబాద్ అని ప్రశంసించారు. సిఎం కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడన్నారు. హైదరాబాద్ మంచి నీటి సరఫరాకు 1920 గండిపేట కట్టారని, 100 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా నీటి సరఫరాపై దృష్టి పెట్టలేదన్నారు. కేశవాపురం రిజర్వాయర్ నిర్మించబోతున్నామని, మరో 50 ఏళ్ల వరకు మంచినీటి సమస్య ఉండదన్నారు. గత ఆరేళ్ల ఎంతో కష్టపడి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై విశ్వాసం వల్లనే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టిఎస్‌ఐపాస్ తీసుకొచ్చామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News