Monday, April 29, 2024

రెచ్చగొట్టే ప్రసంగాలపై చర్యలు తీసుకుంటాం: డిజిపి

- Advertisement -
- Advertisement -

DGP Mahender Reddy Press Meet on GHMC Elections

హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో నగరంలో అల్లర్లకు కొన్ని శక్తులు చేస్తున్న కుట్రలను పోలీస్ శాఖ అణచివేస్తోందని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. డిజిపి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికలను ఆసరాగా తీసుకుని విధ్వంసక శక్తులు మతకల్లోలాలకు కుట్ర చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులపై పోలీస్ నిఘా ఉందని డిజిపి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులను ఎవరూ ఫార్వర్డ్ చేయెద్దని ఆయన నగర ప్రజలను కోరారు. శాంతిభద్రలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వదంతులు, నకిలీ వార్తల సృష్టంచే వారి గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డిజిపి నగర ప్రజలను కోరారు.

పోలీసులకు ప్రజలు విధిగా సహకరించాలని డిజిపి సూచించారు. రాజకీయ నాయకుల ప్రసంగాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, రెచ్చగొట్టే ప్రసంగాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాజకీయ నాయకులపై 50 కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. రాజకీయ నాయకులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. నగరంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 62 మందిపై కేసులు నమోదు చేశామని, అందులో కొందరికి శిక్షలు కూడా పడ్డాయన్నారు. ఒయు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తేజస్వీ సూర్యపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. విధ్వంసక శక్తుల కుట్రలపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం వివరాలు వెల్లడించలేమని డిజిపి చెప్పారు.

DGP Mahender Reddy Press Meet on GHMC Elections

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News