Monday, April 29, 2024

దూసుకుపోతున్న కీర్తి సురేష్

- Advertisement -
- Advertisement -

keerthy suresh marakkar update

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ కీర్తి సురేష్‌కి మంచి క్రేజ్ ఉంది. అందం, అభినయం పుష్కలంగా ఉన్న ఆమెకి అదృష్టం కూడా తోడైంది. దీంతో కెరీర్ ఆరంభంలోనే ఆమెకి మంచి సినిమాలు పడ్డాయి. అయితే స్టార్‌డమ్ వచ్చిన తరువాత కీర్తి సురేష్ కొంచెం తడబడింది. తెలుగులో ‘మహానటి’ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత తమిళంలో బిజీ అయింది. దీంతో తెలుగులో ఆమెకు కొంత గ్యాప్ వచ్చేసింది. ‘మహానటి’ తరువాత కీర్తి సురేష్ మరో పొరపాటు చేసింది. యువ కథానాయకుల జోడీగా ఆమె ఆటపాటలు చూడాలని కుర్రాళ్లు కోరుకుంటే ఆమె నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళ్లింది. పైగా ఆ సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్ కి దూరంగా సీరియస్‌గా సాగడం మరో మైనస్ గా మారింది. ఇక ఈ సమయంలోనే ఆమె నాజూకుగా మారే ఆలోచన కూడా చేసింది. ఆమెను బొద్దుగా చూడటానికి ఇష్టపడిన అభిమానులను ఇది నిరాశకు గురిచేసింది.

ఇలా మంచి క్రేజ్ ఉన్న సమయంలో తొందరపాటు నిర్ణయాలతో ఆమె కెరీర్ గందరగోళంలో పడిపోయింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే ఆమె కాస్త దారిలో పడినట్టుగానే కనిపిస్తోంది. మలయాళంలో ఆమె చేసిన ‘మరక్కార్’ చాలా పెద్ద ప్రాజెక్టు. పైగా ఇది మోహన్ లాల్ కెరీర్‌లోనే చెప్పుకోదగిన సినిమా. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన ఆమె చేస్తున్న ‘సర్కారువారి పాట’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇక తమిళ సినిమా ‘సానికాయిధమ్’లో వైవిధ్యభరితమైన పాత్రలో ఆమె కనిపించనుంది. మే నెలలో ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ మూడు భాషల్లోని మూడు సినిమాలు ఆమె కెరీర్‌ను దూసుకుపోయేలా చేయబోతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News