Sunday, April 28, 2024

మళ్ళీ నవ్వులు మొదలు

- Advertisement -
- Advertisement -

Venkatesh F3 Movie Shooting Update

వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎఫ్3’. ఈ చిత్రం షూటింగ్‌ని మళ్ళీ మొదలుపెట్టినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయం తెలుపుతూ.. దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. “నేను అభిమానించే నా కో-బ్రదర్స్‌తో మళ్ళీ షూటింగ్ మొదలెట్టాము. మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు..”అని అనిల్ రావిపూడి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. హీరో వరుణ్ తేజ్ కూడా “లవ్‌లీ టీమ్‌తో మళ్ళీ వర్క్ మొదలైంది..’ అని తెలుపుతూ.. లొకేషన్‌లోని పిక్‌ని షేర్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. “2019లో సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఎఫ్ 2 సినిమాకు ఫ్రాంచైజీగా ఎఫ్ 3 సినిమాను అదే టీమ్‌తో ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాము. హైదరాబాద్‌లో షెడ్యూల్ ప్రారంభమైంది”అని అన్నారు.

Venkatesh F3 Movie Shooting Update

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News