Saturday, May 11, 2024

ఇక్కడ పూర్తి చేసి అక్కడికి…

- Advertisement -
- Advertisement -

pooja hegde latest movie updates

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న వింటేజ్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ కుమార్ ఈ పాన్ ఇండియా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో పూజాహెగ్డేకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు తెలిసింది. అంతేకాదు ఆమె విజయ్‌తో కలిసి నటిస్తున్న ‘బీస్ట్’ షూటింగ్‌లో చేరినట్లు సమాచారం. చెన్నైలో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో విజయ్, పూజాలపై సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. ఇకపోతే ‘రాధే శ్యామ్’ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్.. ప్రేరణ పాత్రలో పూజా నటిస్తున్నారు. 1960ల నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా కథ నడుస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రానుంది.

pooja hegde latest movie updates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News