Saturday, May 11, 2024

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌పై కేరళ కోర్టు కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Ravishankar-Prasad

తిరువనంతపురం: స్థానిక ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని తిరువనంతపురంలోని చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు శనివారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌పై కేసు నమోదు చేసింది. తనను హత్య కేసులో నిందితుడిగా సంబోధించిన రవిశంకర్ ప్రసాద్ తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ శశి థరూర్ ఇదివరకే లీగల్ నోటీసులు పంపించారు. అయితే క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన రవిశంకర్ ప్రసాద్ ప్రధాని నరేంద్ర మోడీని శివలింగంపై కూర్చున్న నాగుపాముగా అభివర్ణించినందుకు థరూరే మొదట క్షమాపణ చెప్పాలంటూ డిమాండు చేశారు. దీంతో రవిశంకర్‌పై నేరపూరిత పరువునష్టం దావాను సిజెఎం కోర్టులో థరూర్ దాఖలు చేశారు. తన భార్య సునందా పుష్కర్ మరణానికి సంబంధించి కించపరిచే విధంగా తనపై రవిశంకర్ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని థరూర్ తన పిటిషన్‌లో ఆరోపించారు.

Kerala court files case on Ravishankar Prasad, Shashi Tharoor had earlier sent a legal notice to Prasad seeking unconditional apology

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News