Saturday, April 27, 2024

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: ఎమ్మెల్యే గాదరి

- Advertisement -
- Advertisement -

Knowledge increase with Library at Dacharam

మన తెలంగాణ/మోత్కూరు: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, ప్రతి ఒక్కరు గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మోత్కూరు మండలం దాచారం గ్రామంలో సిడిపి నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రంథాలయాల్లో ఉండే పుస్తకాలు యువతీ, యువకులు, విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రంథాలయాల ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జడ్పిటిసి గోరుపల్లి శారదసంతోష్‌రెడ్డి, ఎంపిటిసి రచ్చ కల్పనలక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్ అండెం రజిత రాజిరెడ్డి, టిఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ కంచర్ల అశోక్‌రెడ్డి, వైస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మార్కెట్ వైస్ చైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్లు కొండా సోంమల్లు, తీపిరెడ్డి మేఘారెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్లు జిట్ట లక్ష్మయ్య, సామ పద్మారెడ్డి, ఎంపిఒ సురేందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పొన్నెబోయిన రమేష్, గజ్జి మల్లేష్, నాయకులు చింతల విజయభాస్కర్‌రెడ్డి, కడమంచి వస్తాద్, దాసరి తిరుమలేష్, పురుగుల వెంకన్న, జంగ శ్రీను, పానుగుళ్ల విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

టిఆర్ఎస్ నాయకుడి మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

Knowledge increase with Library at Dacharam

మోత్కూరు మండలంలోని అనాజిపురం గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ నాయకుడు ఉప్పల శ్రీను అనారోగ్యంతో మృతి చెందాడు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ శుక్రవారం ఉప్పల శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రీను చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్‌రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, టి జడ్పిటిసి గోరుపల్లి శారదసంతోష్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ కంచర్ల అశోక్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, ప్రధానకార్యదర్శి గజ్జి మల్లేష్, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కొండా సోంమల్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News