Friday, May 17, 2024

కోరమీసం పోలీసోడా…

- Advertisement -
- Advertisement -

Krack Korameesam polisoda lyrical video release

 

మాస్ మహారాజ రవితేజ, – శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీసర్ పాత్రలో కనిపించనున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇప్పటికే విడుదలైన ‘భూమ్ బద్దల్&’ ‘భలేగా తగిలావే బంగారం…’ పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో క్రిస్మస్ కానుకగా ‘కోరమీసం పోలీసోడా…’ అనే సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ లిరిక్స్ చూస్తుంటే ఇదొక రొమాంటిక్ సన్నివేశంలో వచ్చే పాట అని అర్థమవుతోంది.

‘ఏ జన్మలో నీకు ఏ మందు పెట్టిందో.. నీ జంట కట్టింది ఒంటి మీద ఖాకీ.. అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో.. నీ తలుపు తట్టింది ఏరి కోరి వెతికీ…’ అంటూ పోలీస్ అయిన భర్తతో భార్య పాడుకునే పాట అని తెలుస్తోంది. ఈ గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా… రమ్య బెహరా ఆలపించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ మెలోడీ మంచి స్పందన తెచ్చుకుంటోంది. హీరో రవితేజ, దర్శకుడు గోపిచంద్ మలినేని – కలయికలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో తమిళ నటుడు సముద్రఖని, – వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్న ఈ చిత్రాన్ని జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News