Thursday, May 9, 2024

గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం

- Advertisement -
- Advertisement -

పలు అంశాలపై చర్చ

Krishna River Ownership Board Subcommittee Meeting

 

మనతెలంగాణ/హైదరాబాద్: గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం గురువారం సమావేశమైంది. బోర్డు సభ్యకార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో ఉపసంఘం చర్చలు జరిపింది. ముఖ్యంగా గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై సమావేశంలో చర్చిం చారు. భేటీలో బోర్డు సభ్యులు ఆర్.కె.పిళ్లై, ఇరు తెలుగు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. కెఆర్‌ఎంబీ ఉపసంఘం సమావేశం ఈ నెల 28న జరగాల్సి ఉండగా తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాను కారణంగా భేటీ వాయిదా పడింది. తుఫాను తీవ్రత తగ్గడంతో అధికారులు గురువారం సమావేశ మయ్యారు. ప్రాజెక్టుల నిర్వహణ వివరాలు ఇవ్వాలని గత సమావేశంలో రెండు రాష్ట్రాలను కెఆర్‌ఎంబీ కోరింది. గతంలో జరిగిన సమావేశంలో 10 రోజుల్లోగా వివరాలివ్వాలని స్పష్టం చేసింది. రూ.కోటికి పైగా విలువ ఉన్న కాంట్రాక్టుల వివరాలు సమర్పించాలని పేర్కొంది. అన్ని అంశాలు పూర్తయ్యాక సిఆర్పీఎఫ్‌పై చర్చ ఉంటుందని వెల్లడించింది.
బోర్డు పరిధిలో బానకచర్ల ఉండాలి
బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ బోర్డు పరిధిలోకి రాదని ఎపి వాదించింది. బానకచర్ల కూడా బోర్డు పరిధిలోనే ఉండాలని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ విషయంపై అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని ఉప సంఘం కన్వీనర్ పిళ్లై తెలిపారు. కేంద్రం గెజిట్ అమలుపై ఉపసంఘం కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ, రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన సమాచారం, వివరాలు, సంబంధిత అంశాలపై కెఆర్‌ఎంబీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ ఉప సంఘాల మొదటి సమావేశం ఇటీవలే జలసౌధలో జరిగింది. బోర్డు సభ్యులు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు, జెన్‌కో అధికారులు ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News