Monday, April 29, 2024

అల్లు అర్జున్ అద్భుతమైన నటుడు:కృతిసనన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుపొందిన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్… సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్‌లో ప్రవేశించింది. ఆతర్వాత తెలుగులో ‘దోచెయ్’ సినిమాలో నటించిన ఈ భామ బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణించింది. కృతిసనన్ తాజాగా మాట్లాడుతూ “నాకు ఇష్టమైన దర్శకుడు సుకుమార్. నన్ను టాలీవుడ్‌కు తీసుకువచ్చిన ఆయనపై ఎల్లప్పుడు ప్రేమ, గౌరవం ఉంటుంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇక అల్లు అర్జున్ అద్భుతమైన నటుడు. పుష్ప సినిమాలో ఆయన నట విశ్వరూపం చూపించారు”అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News