Sunday, May 12, 2024

ఓటేసిన వృద్ధులకు వందనం

- Advertisement -
- Advertisement -

యువత వృద్ధులను ఆదర్శంగా చేసుకోవాలి: ట్విట్టర్‌లో కెటిఆర్ ట్వీట్
వీల్‌చైర్‌లో వచ్చి ఓటేసిన సైంటిస్టు రవీందర్‌కు అభినందనలు

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజాస్వామ్యం పరిఢవిల్లే విధంగా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధులను యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర మంత్రి, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో యువతకంటే వృద్ధులే అధికంగా అగుపించారని ఆయన చెప్పారు. 90 సంవత్సరాల ఓ వృద్ధు రాలు ఓటు వేసి ఆఫోటోను కెటిఆర్‌కు ట్విట్టర్ చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వృద్ధులను చూసి యువత నేర్చుకోవాలని పోస్టు చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నిక్లలో ఓటు వేసిన వృద్ధులను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఓటువేసిన వృద్దుల ఫోటోలు సందడిచేస్తున్నయి. అలాగే దివ్యాంగులు అనేక శ్రమలకు ఓర్చుకుని ఓటు హక్కు వినియోగించుకోవడంపట్ల కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఓ సీనియర్ సిటిజన్ తన ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని ఆమె నుమరాలు పద్మశ్రీ ట్విట్టర్‌లో కెటిఆర్‌కు పోస్టు చేశారు. అమ్మమ్మ లాక్‌డౌన్ తర్వాత తొలిసారిగా ఓటు వేసేందుకు బయటకు వచ్చిందని పద్మశ్రీ పేర్కొన్నారు. కరోనా కారణంగా మూడునెలలుగా కదలలేని స్థితిలో ఉన్న చీఫ్ ఎన్విరాన్మెంట్ సైంటిస్టు రవీందర్ వీల్ చైర్‌లో వచ్చి ఓటువేయడంపట్ల కెటిఆర్ అభినందించారు. వయోవృద్ధులు అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా నిలిచారని కెటిఆర్ పేర్కొన్నారు.

KTR Congratulations to Elders for cast their vote in GHMC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News