Monday, May 6, 2024

వైద్య పరికరాల రంగంలో స్వావలంబన

- Advertisement -
- Advertisement -

KTR inaugurates Purnima and Ramm Atmakuri Technology Center

ఆ దిశగా త్వరగా అడుగులు వేద్దాం, ఇప్పటికీ 80% దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం : రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో ఎల్‌వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ పూర్ణిమ అండ్ రామం ఆత్మకూరి టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్ : వైద్య పరికరాలకు సంబంధించిమన దేశం 80 శాతం దిగుమతులపైనే ఆధారపడిందని, దీనిని అధిగమించడానికి స్వాలంభన దిశగా అడుగులు వేద్దామంటూ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కె. తారక రామారావు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆ దీశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కిస్మిత్‌పూర్‌లోని ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ(ఎల్‌విపిఇఐ)లో పూర్ణిమ అండ్ రామం ఆత్మకూరి టెక్నాలజీ కేంద్రాన్ని మంత్రి కెటిఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నేత్రవైద్యంలో ఎల్‌వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రపంచం స్థాయి ప్రమాణలను కల్గిన అద్భుతమైన సంస్థ అన్ని ఈ సంస్థ అధిగమించిన మైలు రాళ్లలో తను సైతం భాగం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు.

భారతదేశంలోనే ఎల్‌వి ప్రసాద్ ప్రమానాలకు సరిపయే సంస్థలు చాల తక్కువ సంఖ్యలో ఉంటాయన్నారు. యుఎస్‌ఎలో వైద్య అభ్యాసం పూర్తి చేసిన డాక్టర్ జి.ఎన్.రావు అక్కడే ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఆయన స్వదేశానికి తిరిగి వచ్చి తన విజ్ఞాన శక్తిని మతృభూమికి అందించడం అభినందనీయమన్నారు. నేను సైతం దేశానికి ఎంతోకొంత సేవ చేయాలని ఉద్యోగానికి వదిలి ఇక్కడి వచ్చానన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి గతంతో పోల్చితే ప్రస్తుతం చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. దేశంలో 80 శాతం మేర వైద్య పరికరాలను దిగుమతి చేసుకోవడం జరగుతోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మేక్‌ఇన్ ఇండియాకు పిలుపునివ్వగా రాష్ట్రంలో పారిశ్రామిక సంస్థలు మరిన్ని పెట్టుబడుల పెట్టేవిధంంగాముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రత్యేక చర్యలు చేపట్టారని తెలిపారు. ఇప్పటీకే సుల్తాన్‌పూర్‌లో అతిపెద్ద మెడికల్ డివైజ్ పార్కును ఏర్పాటు చేశామని, 28కి పైగా కంపెనీలు ప్రాజెక్టులను చేపట్టడమే కాకుండా అవి చివరిదశకు చేరుకున్నాయన్నారు. నేత్ర వైద్యం కోసం వైద్య పరికరాలను తయారు చేయాలని కోరుతున్నామని, ఇందుకు ఎల్‌విప్రసాద్‌ఐ ఇనిస్టిట్యూట్ అందరిని కలిపేందుకు సమన్వయ పాత్రను పోషిస్తుందని వెల్లడించారు.

ఎల్‌విప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సిరిసిల్లతో సహా చిన్న చిన్న పట్టణాల్లో సైతం క్లినిక్‌లను ఏర్పాటు చేయడం మంచి శుభపరిణామన్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం 2018లోనే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండ అందరికీ వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైనవారికి ఉచితంగా కంటి అద్దాలను సైతం అందజేశామన్నారు. తద్వారా దేశంలోనే డిజిటల్ హెల్త్ ఫ్రొఫైల్‌ను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. కోటి మందికి సంబంధించి మెడికల్ రికార్డులు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని కంటి వైద్యానికి సంబంధించి ఎల్‌వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్ పాత్ర చాల కీలకమైందని, ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం ద్వారా మరింత డేటా బేస్‌ను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నందున సమన్వయంతో పని చేద్దామన్నారు. ఎల్‌విపిఇఐ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ రామమ్ ఆత్మకూరి మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా తమ ఇంజనీరింగ్ బృందం ప్రత్యేకమైన గొప్ప ఉత్పత్తులను బయటికి తీసుకురానుందని తెలిపారు. నేత్ర వైద్యుడు, ఇంజనీర్లు, అప్టోమెట్రిస్టులు అందరూ ఒకే తాటిపై విషయాలను ఆలోచించి ఉత్పత్తు చేయడం ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రత్యేకత అని వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News