Saturday, April 27, 2024

అధైర్య పడొద్దు..అండగా ఉంటాం: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR meet with rape victim family

ఎల్లారెడ్డిపేట: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కెటిఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News