Thursday, May 9, 2024

సభలో మాలాంటి వారు మాట్లాడలేని పరిస్థితి ఉంది: కూనంనేని

- Advertisement -
- Advertisement -

సభలో మాలాంటి వాళ్లు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయని సిపిఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో కూనంనేని మాట్లాడుతూ.. ఎజెండా గురించి కాకుండా ఇతర అంశాల్లోకి వెళ్లడం చాలా బాధాకరమన్నారు. సభ నిర్వహణ విధానంలో మార్పు రావాలని చెప్పారు.

ఉచిత విద్యుత్ ను విజయభాస్కర్ రెడ్డి ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ కోసం ఉద్యమం జరిగింది. కమ్యూనిస్టుల ఉద్యమాల వల్లే విద్యుత్ టారిఫ్ ను పెంచే ధైర్యం చేయడం లేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఉచిత విద్యుత్ ను ముందుకు తీసుకెళ్లారని.. ఆచరణలోకి కెసిఆర్ తీసుకొచ్చారని చెప్పారు. చివరకు కోతలు లేని విద్యుత్ ను మనం సాధించుకున్నామన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం 10 నుంచి 12వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం భరిస్తుందన్నారు కెసిఆర్ నిర్ణయాల్లో పొరపాట్ల వల్లే నష్టాలు వచ్చాయని… విద్యుత్ రంగంలో నష్టాలు ఎలా పూడ్చుకోవాలో ఆలోచించాలని కూనంనేని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News