Monday, April 29, 2024

మ్యూజిక్‌తో ‘ఆచార్య’ మ్యాజిక్..

- Advertisement -
- Advertisement -

Laahe Laahe lyrical Song hits 10 million views

అగ్ర దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 152వ సినిమాగా రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం చివరిదశలో ఉన్నటువంటి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను మే 13న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే మెగాస్టార్ సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయనే విషయం విదితమే. ప్రేక్షకుల్లో చిరంజీవి చేసే అదిరిపోయే డ్యాన్సులు, యాక్షన్ సన్నివేశాలకు క్రేజ్ మామూలుగా ఉండదు.

ఇప్పుడు వరుస హిట్లలో ఉన్న కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ మరో బ్లాక్‌బస్టర్ అవుతుందని అంటున్నారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మల కాంబినేషన్ సెట్ అయింది. మరి వీరి కాంబినేషన్‌లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజిక్ పరంగా బిగ్గెస్ట్ హిట్స్. ఆ హిట్స్‌ను దృష్టిలో పెట్టుకొని ‘ఆచార్య’ పై కూడా మెగాఫ్యాన్స్ ఆశలు భారీగా పెట్టుకున్నారు. ఇప్పటికే ‘లాహే లాహే’ అనే ఫస్ట్ సింగిల్ విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నాయట. ‘లాహేలాహే’తో పాటు చిరు, చరణ్‌లపై ఓ సాంగ్, చరణ్, పూజాహెగ్డే డ్యూయెట్‌లతో పాటు ఓ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్.. చివరగా ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉంటుందట. ఐటమ్ సాంగ్‌లో గ్లామరస్ బ్యూటీ రెజీనా కసండ్రా కనిపించనుంది.

Laahe Laahe lyrical Song hits 10 million views

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News