Thursday, May 9, 2024

తెలంగాణలో ఆకలి కేకలు లేవు: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: గత పాలకుల నిర్లక్ష్యంతో రైతులు అప్పుల పాలయ్యారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. నాగార్జులన సాగర్ ఉప ఎన్నికల ప్రచారం భాగంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తరువాత ఆకలిని కెసిఆర్ పారద్రోలారని, కెసిఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. ప్రతి రైతు సంవత్సరానికి పది వేల రూపాయలు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. గుంట భూమి ఉన్న రైతు ఏ కారణం చేత చనిపోయిన వారం రోజులో రైతు భీమాతో ఐదు లక్షల రూపాయల ఇచ్చిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణలో పేద ప్రజలకు అందే పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. పన్నుల ద్వారా వచ్చిన డబ్బులను పేద ప్రజలకు పంచాలని కెసిఆర్ చాలా పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 2014కు ముందు తెలంగాణ ఎలా ఉంది?… ఇప్పుడు ఎలా ఉందో చూడాలని ప్రజలను కోరారు. 2014కు ముందు రైతు ఆత్మహత్యలు, కరెంటు కోతలు ఉండేవని, ఇప్పుడులేవన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపి బడుగుల లింగయ్య, ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్, కోనేరు కోనప్ప హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News