Friday, May 17, 2024

చెరువులు, కుంటలను నింపాలి

- Advertisement -
- Advertisement -

మొదలుపెట్టిన కాలువల పనులన్నీ పూర్తి చేయాలి
రాబోయే యాసంగిలో వేరుశెనగ పంటను పెద్దఎత్తున
సాగుచేసేలా చర్యలు చేపట్టాలి
సాగునీటి పారుదల శాఖ, వ్యవసాయ శాఖ సమీక్షలో మంత్రులు

Lakes filled with water in Telangana
మనతెలంగాణ/హైదరాబాద్:  చెరువులు, కుంటలను నింపాలని, కాల్వలోకి నీరు సరఫరాకు ఆటంకాలు లేకుండా చూసుకోవాలని మంత్రులు ఇరిగేషన్ అధికారులు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ టూరిస్ట్ ప్లాజాలో జరిగిన సాగునీటి పారుదల శాఖ, వ్యవసాయ శాఖ సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు , కాలే యాదయ్య, మెతుకు ఆనంద్, రవీందర్ నాయక్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, రాజేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్, సీఈలు హరిరామ్, అమిత్‌ఖాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పెండింగ్ పనులతో పాటు ఇప్పటికే మొదలుపెట్టిన కాలువల పనులన్నీ పూర్తి చేయాలని మంత్రులు సూచించారు. డిస్ట్రిబ్యూటర్లు, మైనర్, మేజర్ కాలువల పనులు, స్ట్రక్చర్లు, ఓటీల పనులు ఈ వారంలో అయిపోయేలా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతు వేదికల్లో ఈ ఏడాది నిరంతరం రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని, వీటిని పర్యవేక్షించే బాధ్యత ఎమ్మెల్యేలు, కలెక్టర్‌లే చూసుకోవాలని వారు సూచించారు. రాబోయే యాసంగిలో వేరుశెనగ పంటను పెద్దఎత్తున సాగుచేయాలని, యాసంగిలో వరి సాగు తగ్గించి ఆవాలు, నువ్వులు, నూనెగింజల పంటలు సాగుచేయాలని వారు రైతులకు పిలుపునిచ్చారు. తెలంగాణ వేరుశెనగ నాణ్యతలో దేశంలోనే నంబర్ వన్, అంతర్జాతీయంగా దీనికి డిమాండ్ ఉందని,
భవిష్యత్ యాసంగి పంటగా వేరుశెనగను లక్షలాది ఎకరాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. మద్ధతు ధరకు మించి వేరుశెనగకు మార్కెట్లో ధర లభిస్తుందని, ఎమ్మెల్యేలు వేరుశెనగ సాగు వైపు రైతులను ప్రోత్సహించే బాధ్యత తీసుకోవాలని మంత్రులు సూచించారు. రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు వేరుశెనగ సాగుకు అనుకూలమైన ప్రాంతాలని, ఇక్కడ పక్కా ప్రణాళికతో వేరుశెనగ సాగును పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News