Monday, April 29, 2024

శాసనసభ నిరవధిక వాయిదా

- Advertisement -
- Advertisement -

Legislative Assembly was adjourned indefinitely

మనతెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల 6న శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా మూడు రోజుల పాటు కొనసాగాయి. సమావేశాల్లో భాగంగా మొదటిరోజు మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్‌కు సంతాపం అనంతరం సభ వాయిదాపడింది. సోమవారం, మంగళవారాల్లో సభలు కొనసాగాయి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. విభజన చట్టం హామీల అమల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ఎఫ్‌ఆర్‌బిఎం చట్టంలో కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి, రాష్ట్ర ప్రగతిపై దాని ప్రభావంపై తదితర అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరిపై మంత్రులు విరుచుకుపడ్డారు. అనంతరం శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు.

4 బిల్లులపై స్వల్పకాలిక చర్చ

మొత్తం మూడు రోజుల పాటు అసెంబ్లీ జరగ్గా, 11 గంటల పాటు సభ నడిచింది. అందులో 2 తీర్మానాలకు 8 బిల్లులకు ఆమోదం లభించగా, సుమారుగా 50 మంది సభ్యులకు దీనిపై మాట్లాడే అవకాశం లభించింది. అందులో 3 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగ్గా, మిగతా వాటిపై దీర్ఘకాలిక చర్చ జరిగింది. ఇందులో సిఎం కెసిఆర్ 06 గంటల 03 నిమిషాలు మాట్లాడగా, టిఆర్‌ఎస్ సభ్యులు 01.25 నిమిషాలు, ఏఐఎంఐఎం సభ్యులు 38 నిమిషాలు, కాంగ్రెస్ 2.18 నిమిషాలు, బిజెపి సభ్యులు 36 నిమిషాలు మాట్లాడారు.

శాసనమండలి 11 గంటల 42 నిమిషాలు

శాసనమండలి 3 రోజుల పాటు 11 గంటల 42 నిమిషాల పాటు జరగ్గా, 3 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగ్గా, మిగతా వాటిపై దీర్ఘకాలిక చర్చ జరిగింది. మొత్తం 8 బిల్లులకు ఆమోదం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News