Thursday, May 9, 2024

మొదటి ప్రీబయాటిక్‌ మిల్క్‌ షేక్‌..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చిన్నారులు, యువతపై దృష్టి కేంద్రీకరించిన ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ బ్రాండ్‌ లిల్‌ గుడ్‌నెస్‌ భారతదేశపు మొట్టమొదటి రెడీ టు సర్వ్‌ ప్రీబయాటిక్‌ మిల్క్‌షేక్‌ – ప్రీబయాటిక్‌ బ్రేక్‌ షేక్‌ (బ్రేక్‌ఫాస్ట్‌ షేక్‌)ను విడుదల చేసింది. సహజసిద్ధమైన పాల ప్రోటీన్స్‌, ఓట్స్‌, నేచురల్‌ ప్రీబయాటిక్‌ ఫైబర్స్‌ మరియు 40% తక్కువగా పంచదార జోడించబడిన ఈ ప్రీబయాటిక్‌ బ్రేక్‌షేక్స్‌ రెండు ప్రాచుర్యం పొందిన ఫ్లేవర్స్‌ – వనిల్లా మరియు చాక్లెట్‌లో లభ్యమవుతున్నాయి. వీటి ధరలు 200మిల్లీ లీటర్లకు 59 రూపాయలు. ఇది దేశవ్యాప్తంగా ఈ–కామర్స్‌ సహా పలు పంపిణీ మార్గాలలో లభ్యమవుతుంది.

ఓ గిన్నెడు ఓట్స్‌ను పాలు, సహజసిద్ధమైన ప్రీ బయాటిక్స్‌తో కలిపి తీసుకుంటే ఎలాంటి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయో అదే తరహా ప్రయోజనాలు ఈ బ్రేక్‌ షేక్‌లో ఉంటాయి. చిన్నారులు, యువత మాత్రమే కాదు మొత్తం కుటుంబ సభ్యులకు ప్రయోజనకరమైనది ఇది. సహజసిద్ధమైన ప్రీ బయాటిక్‌ డైటరీ ఫైబర్స్‌ మెరుగైన పేగుల ఆరోగ్యంకు భరోసా అందించడంతో పాటుగా ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు భరోసా అందిస్తుంది. విటమిన్‌ ఏ, డీ మరియు జింక్‌ తరహా మినరల్స్‌ తో ఇది సమృద్ధి చేయబడింది. పేగులకు మెరుగైన ఆరోగ్యం అందించే ప్రీ బయాటిక్‌ చాక్లెట్‌ శ్రేణి ఈ ప్రీ బయాటిక్‌ బ్రేక్‌ షేక్‌. దీనిలో అవసరమైన పోషకాలు సైతం ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఓట్స్‌తో విటమిన్‌ ఏ, విటమిన్‌ డీ మరియు కీలక న్యూట్రియంట్స్‌ అయిన మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ మరియు జింక్‌ ఉన్నాయి. లిల్‌ గుడ్‌నెస్‌ అత్యధిక షెల్ఫ్‌ లైఫ్‌తో ఎలాంటి అదనపు నిల్వ కారకాలు జోడించకుండానే వస్తుంది.

ప్రీబయాటిక్‌ బ్రేక్‌ షేక్‌ విడుదల సందర్భంగా లిల్‌ గుడ్‌నెస్‌ ఫౌండర్‌ హర్షవర్థన్‌ ఎస్‌ మాట్లాడుతూ.. ‘‘కృత్రిమ పదార్ధాల వినియోగం వీలైనంతగా తగ్గించి ఆరోగ్యవంతమైన, అత్యుత్తమ అవకాశాలు అందించడం ద్వారా చిన్నారులు మరియు పెద్దలకు ఆరోగ్యవంతమైన పదార్థాలను అందించాలనే మా లక్ష్యంకు అనుగుణంగా ప్రీబయాటిక్‌ మిల్క్‌షేక్‌ను ఇండియాలో విడుదల చేశాం. పేగు ఆరోగ్యం మరియు సూక్ష్మ పోషకాల పోర్టిఫికేషన్‌ అనేది అందుబాటు ధరలలో అందించడమనేది మాకు అత్యంత కీలకమైన అంశం. మా మార్కెట్‌ పరిశోధనలు వెల్లడించే దాని ప్రకారం బ్రేక్‌ఫాస్ట్‌ విభాగంలో గణనీయమైన అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా బేవరేజ్‌ విభాగంలో ఈ అవకాశాలు అధికంగా ఉన్నాయి. పాఠశాలలు, ఆఫీసులు పూర్తిగా తెరుచుకుంటుండటంతో దీనిని ఆరోగ్యవంతమైన, సౌకర్యవంతమైన బేవరేజ్‌ స్నాక్‌గా సృష్టించాలనుకుంటున్నాము. మార్కెట్‌ అధ్యయనాల ప్రకారం వదులుకోలేనిట్టి రుచులను అత్యంత అందుబాటు ధరలలో అందించనున్నాం. మా డిజిటల్‌ చేరిర ఇప్పుడు కనీసం 14వేల పిన్‌కోడ్స్‌ను భారతదేశంలో కవర్‌ చేసింది. ప్రీ బయాటిక్‌ మిల్క్‌షేక్‌లకు ఆఫ్‌లైన్‌లో సైతం చక్కటి ఆసక్తి ఇప్పుడు కనిపిస్తుంది’’ అని అన్నారు.

ప్రీబయాటిక్‌ బ్రేక్‌షేక్‌లో 100మిల్లీ లీటర్లకు 76.83 కిలోకేలరీల శక్తి లభిస్తుంది. దీనిలో కార్బోహైడ్రేట్స్‌: 12.53 గ్రాములు, జోడించిన చక్కెర: 4.73 గ్రాములు, ప్రొటీన్‌: 3.10 గ్రాములు, డైటరీ ఫైబర్‌: 1.78 గ్రాములు, టోటల్‌ ఫ్యాట్‌: 1.59 గ్రాములు, జింక్‌: 0.89 గ్రాములు, విటమిన్‌ ఏ: 39.92 ఎంసీజీ, విటమిన్‌ డీః 0.68 ఎంసీజీ, కాల్షియం: 100మిల్లీ గ్రాములు ఉన్నాయి. ప్రీబయాటిక్‌ బ్రేక్‌ షేక్‌ ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు, సూరత్‌, రాజ్‌కోట్‌లతో పాటుగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ ఫార్మాట్‌లలో లభ్యమవుతుంది. లిల్‌గుడ్‌నెస్‌ ఇప్పుడు తెలంగాణా, మధ్య ప్రదేశ్‌, ఏపీ మరియు మహారాష్ట్ర, ఎంపిక చేసుకున్న ఈశాన్య రాష్ట్రాలు లో విస్తరించడానికి ప్రణాళిక చేసింది.

Lil Goodness Introduces First Prebiotic Milk Shake

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News