Monday, April 29, 2024

హాక్ ఐతో మొబైల్స్ ఆచూకీ

- Advertisement -
- Advertisement -

Locate Mobile With Hawk eye app

565 మొబైల్ ఫోన్లు కనిపెట్టిన పోలీసులు
అందజేసిన నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్ : మొబైల్ ఫోన్లు పోగుట్టుకున్న బాధితులకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వాటిని అప్పగించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వాటిని అందజేశారు. నగరంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని వారు మొబైల్ ఫోన్లు మిస్సయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను హాక్‌ఐ లో నమోదు చేయగా పోలీసులు దర్యాప్తు చేసి వాటి ఆచూకీ కనిపెట్టారు. ఇలా కనిపెట్టిన 56 మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారికి అందజేశారు. హాక్ ఐ యాప్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 565 మొబైల్ ఫోన్ల ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఇప్పటి వరకు పట్టుకున్న మొబైల్ ఫోన్ల విలువ రూ.8లక్షలు ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News