Monday, April 29, 2024

తెలంగాణకు దూరంగా వెళ్లిన అల్పపీడనం… రాష్ట్ర మంతటా వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఒడిశా పరిసరాలలోని ,దక్షిణ జార్ఖండ్ , చత్తీస్‌గఢ్ వద్ద ఉన్న అల్పపీడనం మంగళవారం తెలంగాణ రాష్ట్రానికి దూరంగా వెళ్లిపోయింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా క్రియాశీలకం అయ్యాయి. వీటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజుల్లో ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

గడిచిన 12గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా పిప్పాలధారిలో అత్యధికంగా 47.6 మి.మీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో 21మి.మి వర్షం పడింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని అమీర్‌పేట, సంతోష్‌నగర్, చంపాపేట, సైదాబాద్, సరూర్‌నగర్, శామీర్‌పేట, నిజాంపేట, బాచుపల్లి , కూకట్‌పల్లి పాంత్రాలతోపాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురిశాయి. రాగల 24గంటల్లో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ ,కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ , జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ , పెద్దపల్లి , జయశంకర్ భూపాలపల్లి ,ములుగు జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News