Saturday, April 27, 2024

ఆగస్టు 19న థీయేటర్లలో ‘మహా సముద్రం’

- Advertisement -
- Advertisement -

Mahasamudram Movie to release on Aug 19

‘ఆర్ఎక్స్ 100’ బ్లాక్ బస్టర్ సినిమాతో డైరెక్టర్‌ అజయ్‌ భూపతి టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ మూవీ తర్వాత అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. ఈ చిత్రంలో యంగ్ హీరో శర్వానంద్‌ తోపాటు సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడు. వీరిద్దరికి జోడీగా అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టైటిల్ మోషన్ మోస్టర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది. ‘ఆగస్టు 19న.. ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం’ అంటూ సినిమా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్ చేసింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీకి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్‌ ల‌వ్ అండ్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ తెలుగు, త‌మిళ భాషల్లో విడుదల కానుంది.

Mahasamudram Movie to release on Aug 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News