Sunday, April 28, 2024

కోదాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తా

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:కోదాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తా అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ పట్టణంలోని 18 వార్డులో 15లక్షల రూపాయలతో చేపడుతున్న బ్రిడ్జీ పనులకు ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం 20వ వార్డులో పర్యటించి చేపట్టాల్సిన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

పట్టణాల్లో, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా అని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించాలని కోరారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం రూ .1,00,116 ఆర్థిక సాయం అందజేస్తున్నదని అన్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు. ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు కర్రి శివసుబ్బారావు, బెజవాడ శిరీష శ్రవణ్, పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, నాయకులు వెంపటి మధుసూదన్, పుప్పాల వీరబాబు, కాళిదాస్ వెంకటరత్నం, మాధవి, ఉపేందర్, కంబాల రంగా, వెంకటేశ్వర్లు, ఓరుగంటి శ్రీను, మల్లు జగన్నాథరెడ్డి, లలిత, కాసర్ల శ్రీను, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News