Monday, April 29, 2024

మోడీ సెల్ఫీపాయింట్లతో ప్రజాధనం దుబారా : ఖర్గే ధ్వజం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రైల్వేస్టేషన్లలో ప్రధాని మోడీ ఫోటోలతో సెల్ఫీబూత్‌లను ఏర్పాటు చేస్తుండడం ప్రజాధనాన్ని దుబారా చేయడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ధ్వజమెత్తారు. విపక్షపాలిత రాష్ట్రాల్లో ఉపాధి నిధులను మంజూరు చేయలేని మోడీ ప్రభుత్వం ఈ విధంగా ప్రజల పన్నుల నుంచి వచ్చిన ఆదాయాన్ని విపరీతంగా దుబారా చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేటగిరి ఎ స్టేషన్లలో తాత్కాలిక సెల్ఫిబూత్‌లకు ఒక్కొక్కదానికి రూ.1.25 లక్షలు ఖర్చవుతుండగా, సి కేటగిరీ స్టేషన్లలో పెర్మనెంట్ సెల్ఫీబూత్‌లకు ఒక్కొక్కదానికి రూ. 6.25 లక్షలు ఖర్చవుతున్నట్టు సమాచార హక్కు ద్వారా రాబట్టిన సమాచారం వెల్లడించింది.

దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఈ సెల్ఫీల పేరుతో ఎంత ప్రజాధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుతోందో తెలుస్తుందని మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. ఇటువంటి 822 సెల్ఫీలను ప్రధాని మోడీ కటౌట్ల దగ్గర ఏర్పాటు చేయడానికి సైనికులను కూడా మోడీ ప్రభుత్వం వినియోగిస్తోందని దుయ్యబట్టారు. విపక్ష రాష్ట్రాల్లో కరవు, వరదల నష్టాల నివారణకు కానీ, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాథి పథకానికి కానీ మోడీ ప్రభుత్వం నిధులు కేటాయించకున్నా ఈ స్వీయ ప్రచార సెల్ఫీలకు మాత్రం నిధులు ఖర్చుచోస్తోందని విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News