Sunday, May 12, 2024

రెండున్నర కోట్లు మోసపోయిన సిజెఐ తల్లి

- Advertisement -
- Advertisement -

Man arrested for ‘duping Bobde’s mother of Rs 2.5 crore’

 

కేర్‌టేకర్ అరెస్టు .. సిట్ దర్యాప్తు

నాగ్‌పూర్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బోబ్డే తల్లిని ఓ వ్యక్తి రెండున్నర కోట్ల రూపాయల మేరకు మోసగించాడు. నిందితుడు అయిన తపస్ ఘోష్‌ను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన న్యాయమూర్తి తల్లి ఆస్తుల సంరక్షుడిగా ఉంటూ ఉన్న ఘోష్ నమ్మించి మోసగించాడు. నాగ్‌పూర్‌లోని ఆకాశ్‌వాణి స్వేర్‌లో ఉన్న సీడాన్ లాన్ స్థలానికి ప్రధాన న్యాయమూర్తి తల్లి ముక్తా బోబ్డే యజమానురాలిగా ఉన్నారు. దీనిని పెళిళ్లు, ఇతరత్రా వేడుకలకు అద్దెకు ఇస్తూ వస్తున్నారు. 2007లో తపస్ ఘోష్‌ను ఈ ఆస్తి సంరక్షకుడిగా నియమించారు. వేతనం, కమిషన్ వంటి ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ఆయనను నమ్మిన ముక్తా తన అనారోగ్యం , పెద్ద వయస్సుతో ఈ ఆస్తి వ్యవహారాలన్నింటిని కట్టబెట్టింది.

ఈ క్రమంలో తపస్ చెలరేగిపొయ్యాడు. వచ్చిన అద్దెను యజమానురాలికి ఇవ్వకపోవడంతో పాటు తక్కువ ఆదాయం ఉందనే తప్పుడు రసీదులు సృష్టించి ఆమెను అన్ని విధాలుగా మోసగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మొత్తం వ్యవహారంపై ఇప్పుడు డిసిసి వినీత సాహు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పరిశీలన జరుపుతోందని, పూర్తివివరాలను రాబడుతారని నాగ్‌పూర్ పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. తపస్ తన కార్యకలాపాలకు కరోనా వైరస్ దశను కూడా బాగా వాడుకున్నాడు. అంతకు ముందు ఫంక్షన్లకు హాల్ బుక్ అయింది. అయితే కరోనాతో ఈ కార్యక్రమాలు రద్దు అయినా ఈ వ్యక్తి డబ్బులు చెల్లించిన వారికి వీటిని తిరిగి ఇవ్వలేదు. ఈ విధంగా విపరీతంగా డబ్బు వెనుకేసుకున్నట్లు వెల్లడైంది. మొత్తం మీద ఈ కుటుంబానికి రెండున్నర కోట్ల మేర మోసగించినట్లు కనుగొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News