Monday, April 29, 2024

నగరంలో నకిలీ వస్తువులు

- Advertisement -
- Advertisement -

Man Arrested For Selling Fake Goods in hyderabad

దాడులు చేస్తున్న పోలీసులు
నకిలీ అల్లం, టీ పౌడర్, నెయ్యి
సులభంగా సంపాదించేందుకు అడ్డదారులు

హైదరాబాద్: నకిలీ వస్తువులు తయారు చేస్తు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పలువురు వ్యాపారులు సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో వినియోగదారులు ప్రతి రోజు వాడే వస్తువుల్లో నకిలీ వస్తువులు తయారు చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు. ఇలా వచ్చిన వస్తువులు నకిలీవా, అసలువా అనే విషయం తెలియకుండా పలువురు వాడుతున్నారు. పోలీసులు వరుసగా దాడులు చేయడంతో పలు వస్తువుల నకిలీ స్థావరాలు బయపడుతున్నాయి. ఇటీవల పోలీసులు దాడులు చేయడంతో నకిలీ నెయ్యి, నకిలీ అల్లం, నకిలీ టీ ఫౌడర్ తయారు చేసి విక్రయిస్తున్న స్థావరాలపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా నగర ప్రజలు ఆశ్చర్యానికిగురయ్యారు. హైదరాబాద్‌లో పలువురి జీవన విధానం బిజీగా మారడంతో చాలా వస్తువులను రెడీమేడ్‌గా కొనుగోలు చేస్తున్నారు. దీనిని అవకాశంగా మల్చుకున్న పలువురు వ్యాపారులు నకిలీ వస్తువులు తయారీ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. నకిలీ వస్తువుల తయారీలో ప్రమాదకరమైన కెమికల్స్‌ను వాడడంతో వాడే వారి ఆరోగ్యం తీవ్ర స్థాయిలో దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నకిలీ టీ ఫౌడర్ తయారు చేస్తున్న వారిని అరెస్టు చేశారు. నకిలీ నెయ్యి తయారు చేస్తున్న బేగంబజార్‌కు చెందిన వ్యాపారులను అరెస్టు చేశారు.

తాజాగా నకిలీ అల్లం తయారు చేస్తున్న ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితులు లక్షలాది రూపాయల వస్తువులు తయారు చేస్తున్నారు. నిత్యం వాడే వస్తువులు కావడంతో తమకు లాభాలు ఎక్కువగా వస్తాయని చెప్పి వ్యాపారులు తయారు చేసి విక్రయిస్తున్నారు. నకిలీ అల్లం తయారీ యూనిట్‌పై దాడి చేసి రూ.5లక్షల విలువైన వస్తువులు, నకిలీ నెయ్యి తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 970 లీటర్ల నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన దీపక్ పెనూర్కర్, హిమయత్‌నగర్‌కు చెందిన రాహుల్ అగర్వాల్‌ను అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులు చేస్తున్న వ్యాపారం కరోనా సమయంలో తీవ్రంగా దెబ్బతినడంతో నకిలీ వస్తువులు తయారు చేస్తున్నారు. పామోలిన్, వెజిటబుల్ ఫ్యాట్‌తో నకిలీ నెయ్యి తయారు చేసి దానికి విజయ బ్రాండ్ హోలోగ్రాంను అంటించి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

ఆరోగ్యంతో ఆటలు…

నకిలీ వస్తువులు తయారు చేస్తున్న వ్యాపారులు వాటిని మార్కెట్‌లో విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చాలామంది వినియోగదారులు ఇవి అసలు వస్తువులని నమ్మి కొనుగోలు చేస్తున్నారు. వాటిని వాడడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. తయారీదారులు అపరిశుభ్రమైన వాతావరణంలో వాటిని తయారు చేయడమే కాకుండా అసలు వాటిలా నమ్మించేందుకు కెమికల్స్ వాడుతున్నారు. కెమికల్స్ వాడడంతో వాటిని వినియోగదారులు తినే వస్తువుల్లో వేయడంతో ఆరోగ్యం దెబ్బతిని ఆస్పత్రి పాలయ్యే అవకాశం ఉంది. ఫుడ్ ఇన్స్‌స్పెక్టర్లు తరచూ వాటిపై దాడి చేసి తనిఖీలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News