Wednesday, December 6, 2023

మహిళకు అసభ్య ఫొటోలు పంపిస్తున్న యువకుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Man Arrested For Sending Obscene Pictures to women

హైదరాబాద్: మహిళకు అసభ్య మెసేజ్‌లు, అశ్లీల ఫొటోలు పంపిస్తు వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపి, కర్నూలు జిల్లా, కొల్లూరు మండలం, బస్తిపాడు గ్రామానికి చెందిన బోయన హరినారాయణ డిగ్రీ వరకు చదువుకున్నాడు. స్థానికంగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటర్ నుంచే ఫేస్‌బుక్‌ను వాడుతున్నాడు. ఫేస్‌బుక్‌లో వివిధ పేర్లతో ఖాతాలు ఓపెన్ చేశాడు. మహిళలు, యువతుల పేర్లతో ఖాతాలు తెరిచారు.

వాటి ద్వారా ఆగస్టు, 2020లో మహిళకు అసభ్య మెసేజ్‌లు, అశ్లీల ఫొటోలు, వాయిస్ మెసేజ్‌లు పంపించి వేధింపులకు గురిచేస్తున్నారు. కావ్యలక్కీ, భవానీ వై పేర్లతో ఫేస్‌బుక్ లో ఖాతాలు ఓపెన్ చేసి బాధితురాలితో ఛాటింగ్ చేశాడు, కొద్ది రోజుల తర్వాత మహిళ ఛాటింగ్ చేయడం మానివేసింది. దీంతో అవమానంగా భావించిన యువకుడు బాధితురాలి ఫొటోలు, వాయిస్ మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి మొబైల్ నంబర్‌కు వాయిస్ మెసేజ్‌లు, ఫొటోలు పంపిస్తున్నాడు. ఇలా పంపిస్తూ వేధింపులకు గురిచేస్తుండడంతో బాధితురాలు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ వెంకటేష్ దర్యాప్తు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News