Monday, April 29, 2024

బాలీవుడ్‌లో ఉన్న స్వేచ్ఛ సౌత్‌లో లేదు

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ముద్దుగుమ్మ సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు వెళ్తోంది. ఈ అమ్మడు ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రను ఈ వెబ్ సిరీస్‌లో చేసింది. నెగటివ్ షేడ్స్ ఉండే పాకిస్తానీ అమ్మాయిగా సమంత కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే యూనిట్ సభ్యుల నుండి అనధికారిక క్లారిటీ వచ్చింది. అతి త్వరలోనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఈ సమయంలోనే సమంత ఒక చిట్ చాట్‌లో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి, నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మధ్య ఉన్న తేడాను చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “బాలీవుడ్‌లో హీరోలు, హీరోయిన్లు ఎలాంటి పాత్రల్లో నటించినా కూడా ప్రేక్షకులు చూస్తారు. కానీ సౌత్‌లో ఒక జోనర్‌లో పడ్డ హీరోలు, హీరోయిన్లు మరో జోనర్‌లో నటించడం లేదా మరో రకంగా నటిస్తే ప్రేక్షకుల నుంచి సరైన స్పందన ఉండదు. బాలీవుడ్‌లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయడం పెద్ద సమస్య కాదు. కానీ సౌత్‌లో అలాంటి పాత్రలు చేస్తే ప్రేక్షకులు అంగీకరించడం కష్టం. అందుకే బాలీవుడ్‌లో ఉన్న స్వేచ్ఛ సౌత్ సినీ ఇండస్ట్రీల్లో ఉండదు”అని పేర్కొంది. ఇక ప్రస్తుతం సమంత తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది.

Bollywood has liberty than South: Samantha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News