Monday, April 29, 2024

మాటలు రావడం లేదు: విరాట్ కోహ్లి

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: మొదటి టెస్టులో భారత్ అత్యంత ఘోర పరాజయం కావడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘రెండో ఇన్నింగ్స్‌లో ఇంత ఘోరంగా విఫలమవుతామని కలలో కూడా ఊహించలేదు. జట్టు ప్రదర్శనపై స్పందించేదుకు మాటలు కూడా రావడం లేదు. ఇలాంటి చెత్త బ్యాటింగ్ చూడాల్సి వస్తుందని అనుకోలేదు. కనీసం ఇద్దరు ముగ్గురైన క్రీజులో నిలదొక్కుకుని ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. అయితే క్రికెట్‌లో ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడం సహాజమే. ఈ ఓటమిని ఓ పీడకలగా మరచి పోవడమే జట్టుకు మంచిది’ అని కోహ్లీ పేర్కొన్నాడు. కాగా, అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్‌లో భారత్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అవమానకర స్కోరును నమోదు చేసింది. ఆతిథ్య ఆస్ట్రేలియా బౌలర్లు హాజిల్‌వుడ్ (5/8), పాట్ కమిన్స్ (4/21)ల దెబ్బకి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి కేవలం 36 పరుగులకే పరిమితమైంది. టీమిండియాలో ఏ ఒక్కరూ కూడా డబుల్ డిజిల్ స్కోరును అందుకోలేక పోయారు. మహ్మద్ షమి రిటైర్ట్‌ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక 90 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 21 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

Virat Kohli Reacts on Lost 1st Test Match

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News