Monday, April 29, 2024

రూ.30 వేల కోసం మద్యం మత్తులో వ్యక్తి హత్య

- Advertisement -
- Advertisement -

జగదేవ్‌పూర్ : బేరానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి మూడు రోజుల తర్వాత చెరువులో శవమై తెలిన సంఘటన జగదేవ్‌పూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. జగదేవ్‌పూర్ మండల పరిధిలోని పీర్లపల్లి గ్రామానికి చెందిన ఎర్ర కర్ణాక ర్( 28 )కట్టెల బెరం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఈనెల 18వ తేదీ గురువారం వ్యాపార పని మీద బయటకు వెళ్తున్నానని భార్యతో చెప్పి వెళ్లిన కరుణాకర్ మూడు రోజులుగా ఇంటికి వెళ్లలేదు ఇంట్లో రెండు రోజులుగా వెతకడం ప్రారంభించారు.

ఆ నోట ఈ నోట జగదేవ్‌పూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కరుణాకర్ పై దాడి చేశారని తెలుసుకున్నారు. జగదేవ్‌పూర్ గ్రామంలో కర్ణాకర్ సెల్‌ఫోన్ అమ్ముతుండగా చూడడంతో పీర్లపల్లి గ్రామ వ్యక్తి చూసి గ్రామస్తులకు తెలియజేశాడు. విషయం తెలుసుకున్న కర్ణాకర్ కుటుంబ సభ్యులు సెల్ అమ్ముతున్న వ్యక్తిని నిలదీయగా కర్ణాకర్ ను గురువారం రోజు హత్య చేసి జగదేవ్‌పూర్‌లో గల చెరువులో వేసినట్లు తెలిపినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌లో అప్పగించగా అతనితో పాటు మరొకతను కలిసి హత్య చేసినట్లు గా ఒప్పుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

30వేల రూపాయల కోసం హత్య… జగదేవ్‌పూర్ లో గల ఓ మద్యం దుకాణంలో ముందు బంధువులతో కర్ణాకర్ మందు తాగాడు. అనంతరం జగదేవపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అతన్ని గమనించారు. అనంతరం అతని వద్ద గల 30 వేల రూపాయలు తీసుకొని అతన్ని సు మా రు 9 గంటల తరువాత కొట్టి చంపినట్లు తెలిపారు.
పోయిన ప్రాణం ఎట్లాగూ రాదు బేరం మాట్లాడుకుందాం…
హత్య చేయబడ్డ ఎర్ర కర్ణాకర్ కుటుంబ సభ్యులు రోడ్డు మీద ధర్నా చేస్తూ పోయిన ప్రాణం ఎట్లాగూ రాదు ఉన్నవారికి న్యాయం చేయండి అంటూ ఒక విధంగా బేర సారాలకు ఆ ఊరు జనాలు మాట్లాడసాగారు. కానీ ఎవరు ముందుకు రాకపోవడంతో న్యాయం చేయాలని ధర్నాకు దిగారు.

రోడ్డుపై బాధితుని కుటుంబీకుల ధర్నా… బాధితుని కుటుంబ సభ్యులు నిందితులను కఠినంగా శిక్షించాలని తమకు నిందితులను అప్పగించాలం టూ పోలీస్ స్టేషన్ ఎదుట సుమారు అరగంట పాటు ధర్నా నిర్వహించా రు. దీనితో రోడ్డుపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో గజ్వేల్ ఏ సిపి రమేష్ ,గజ్వేల్ సిఐ జాన్ రెడ్డి, రూరల్ సీఐ జానకి రామ్ రెడ్డి సం ఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పె ప్ర యత్నం చేశారు. వారు ఎంతకు వినకపోవడంతో పీర్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కే సి రెడ్డి రవీందర్ రెడ్డి జోక్యం చేసుకొని బాధితులకు నచ్చజెప్పడంతోధర్నాను విరమించుకున్నారు.

విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తాం ఏసీపీ రమేష్.. జరిగిన సంఘటనపై విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఏసీపి రమేష్ తెలిపారు. హత్యలో పా ల్గొన్న జగదేవ్‌పూర్ గ్రామానికి చెందిన కొంపల్లి నాగరాజు , రాగుల గణేష్ లను అరెస్ట్ చేశామని అన్నారు. విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అనంతరం నిందితులను జైలుకు తరలిస్తామని తెలిపారు. ఆయన వెంట ఎస్‌ఐ చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News