Saturday, April 27, 2024

ఆకాశంలో ఎగిరిపోయిన విమానం డోర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే గగనతలంలో విమానం డోర్ ఊడి పడిపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్న అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం పెను ప్రమాదాన్ని తప్పించుకుంది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పోర్ట్‌ల్యాండ్ నుంచి కాలిఫోర్నియాలోని అంటారియోకు బయల్దేరిన అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 1282 టేకాఫ్ అయిన కొద్ది సేపట్టికే గగనతలంలో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది. అధిక పీడనం కారణంగా విమానంలోని డోర్ బయటకు ఎగిరిపడింది. 16 వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే విమాన సిబ్బంది ఎమర్జెన్సీ విమానాన్ని తిరిగి పోర్టల్యాండ్‌కు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

సాయంత్రం 5.26 గంటలకు విమానం పోర్ట్‌ల్యాండ్ విమానాశ్రయంలో సేఫ్‌గా ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. టేకాఫ్ అయిన 20 నిమిషాలకు గగనతలంలో ఈ ఘటన జరిగింది. అధిక పీడనం కారణంగానే విమానం డోర్ గాలికి ఎగిరిపోయినట్లు విమాన సిబ్బంది తెలిపారని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వ పౌరవిమానయాన శాఖ అధికారులు తెలిపారు. కొత్త మ్యాక్స్ 9 బోయింగ్ విమానాన్ని అలాస్కాకు గత అక్టోబర్ చివరిలో అందింది. దీనికి నవంబర్ మొదట్లో ఫయింగ్ ఫిట్‌నెట్ సర్టిఫికెట్ లభించింది. అలాస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1282లో జరిగిన సంఘటన గురించి తమకు సమాచారం అందిందని, ఈ ఘటనకు సబంధించి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని బోయింగ్ విమాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాస్కా ఎయిర్‌లైన్స్‌తో సంప్రదింపులు జరుపుగుతన్నామని, తమ సాంకేతిక బృందం దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తోందని బోయింగ్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News