Monday, May 6, 2024

మనోజ్ తివారీ ట్రిపుల్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

Manoj Tiwari

 

బెంగాల్ 635/7 డిక్లేర్డ్
హైదరాబాద్ 83/5
రంజీ పోరు

కోల్‌కతా: రంజీ సీజన్‌లో హైదరాబాద్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. బెంగాల్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 635 పరుగుల భారీ స్కోరు సాధించి డిక్లేర్డ్ చేసింది. స్టార్ ఆటగాడు మనోజ్ తివారీ అజేయ ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కాడు. హైదరాబాద్ బౌలర్లు హడలెత్తించిన తివారీ ఐదు సిక్సర్లు, 30 ఫోర్లతో 303 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన తివారీ రికార్డు శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు.

వికెట్ కీపర్ గోస్వామి (95), అర్నబ్ నంది 65 (నాటౌట్) మనోజ్‌కు అండగా నిలిచారు. వీరి సహకారంతో తివారీ చారిత్ర ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే క్రమంలో జట్టుకు భారీ స్కోరును కూడా అందించాడు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఆకాశ్ దీప్ మూడు, ముకేశ్ రెండు వికెట్లు తీసి హైదరాబాద్‌ను కష్టాల్లోకి నెట్టారు. 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌కు ఈ మ్యాచ్‌లో కూడా ఘోర పరాజయం ఖాయంగా కనిపిస్తోంది.

Manoj Tiwari’s triple century
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News