Wednesday, May 8, 2024

తిర్యాని అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు

- Advertisement -
- Advertisement -

Maoist leader Bhaskar escape police net

ఆసిఫాబాద్: జిల్లాలోని తిర్యాని అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు నిర్వహిస్తున్న కూబింగ్ లో మావోయిస్టులు తప్పించుకున్నట్టు సమాచారం. రెండ్రోజుల క్రితం పోలీసుల కూబింగ్ లో మావోయిస్టు నేత, రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల కోసం 48 గంటల పాటు పోలీసుల వేట కొనసాగింది. తిర్యాని మండలం, గుండాల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్న నేపథ్యంలో సోమ, మంగళవారాలలో పోలీసు ప్రత్యేక బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించాయి.

అడుగడుగున గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. తిర్యాని ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారని, మావోయిస్టు స్టేట్ కమిటీ మెంబర్ మైలవరపు అడేల్లు అలియాస్ భాస్కర్, ఏరియా కమిటీ మెంబర్ వర్గేష్‌తో పాటు మరో ముగ్గురు మావోయిస్టు సభ్యులు తృటిలో పోలీసుల దృష్టి నుంచి తప్పించుకున్నారని పోలీస్ అధికారులు తెలిపారు. రెండు వారాల క్రితం మావోయిస్టు కొరియర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న క్రమంలో వారి నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో రిక్రూట్‌మెంట్ చేస్తున్నట్లు పోలీసులకు కీలక సమాచారం అందిన వెంటనే అప్రమత్తమయ్యారు. అడుగడుగున గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులకు సెల్టర్ జోన్‌గా ఉన్న మంతి, తిర్యాని అటవీ ప్రాంతంలో పోలీసులు పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టు నేతలు తప్పించుకున్న ప్రాంతంలో కీలక సమాచార పత్రాలు లభ్యమయ్యాయి. విప్లవ సాహిత్యం, మావోయిస్టుల యూనిఫాంలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్లు, పాలితిన్ కార్పెట్స్ తదితర వస్తువులు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News