Saturday, April 27, 2024

మొబైల్ దొంగతనం…. తీవ్రంగా కొట్టి నగ్నంగా ఊరేగించారు..

- Advertisement -
- Advertisement -

Mobile thieves

 

ముంబయి: మొబైల్ దొంగతనం చేశారని ఇద్దరు యువకులను స్థానికులు తీవ్రంగా కొట్టి నగ్నంగా ఊరేగించిన సంఘటన మహారాష్ట్రలోని థానే ప్రాంతం అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్‌లో జరిగింది. గురువారం సాయంత్రం ఇద్దరు యువకులు ఫోన్లు దొంగతనం చేస్తుండగా స్థానిక వ్యాపారులు పట్టుకున్నారు. ఆ ఇద్దరు దొంగలను తీవ్రంగా కొట్టిన అనంతరం బట్టలూడదీసి నగ్నంగా ఊరేగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. నగ్నంగా ఊరేగించిన వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం.

 

Market traders beat on Mobile thieves in thane
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News