Monday, April 29, 2024

మారుతీరావు అంత్యక్రియలు.. ఉద్రిక్తం

- Advertisement -
- Advertisement -

Maruti Rao Funeral

 

కడసారి చూసేందుకు వచ్చిన అమృత
‘గో బ్యాక్’ అంటూ నినాదాలు

మన తెలంగాణ/మిర్యాలగూడ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు తిరునగరు మారుతీరావు అంత్యక్రియలు ఉద్రిక్తతల నడుమ సోమవారం ముగిశాయి. మారుతీరావు హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విష యం విధితమే. ఆయన అంతిమయాత్ర రెడ్డికాలనీలోని స్వగృహం నుంచి మృతదేహాన్ని చర్చిరోడ్డు, నటరాజ్ థియేటర్ నుంచి సాగర్‌రోడ్డు మీదుగా షాబునగర్‌లోని హిందూ స్మశానవాటిక వరకు సాగింది. ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఆయన కుమారుడు నల్లమోతు సిద్దార్థ, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్‌లతో పాటు, బంధువులు, అభిమానులు, స్నేహితులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

అమృతను పోలీసు ప్రత్యేక వాహనంలో తండ్రిని కడసారి చూసేందుకు హిందూ స్మశానవాటికకు చేరుకోగా ఆ సమయంలో మారుతీరావు బంధువులు, స్నేహితులు ‘అమృత గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. స్మశానవాటిక వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే భాస్కర్‌రావు అక్కడే ఉండి బంధువులు, స్నేహితులను వారించినా వినకుండా గట్టిగా నినాదాలు చేయడంతో పోలీసులు ఆమెను తిరిగి పోలీసు వాహనంలోనే ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం మారుతీరావు చితికి సోదరుడు శ్రవణ్‌కుమార్ నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

పలువురి పరామర్శ..
మారుతీరావు పార్థివ దేహాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్‌నాయక్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లకా్ష్మరెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు కర్నాటి ప్రభాకర్, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కర్నాటి రమేష్, బండారు కుశలయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు తెడ్ల జవహర్‌బాబు, రేపాల రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అమృతకు అస్వస్థత
అమృత ప్రణయ్ సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే 108 వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వూ ఇస్తున్న సమయంలో ఆమె సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Maruti Rao Funeral is furious
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News