Friday, May 3, 2024

రాష్ట్రంలో భారీగా ఐఎఎస్‌ల బదిలీలు

- Advertisement -
- Advertisement -

 

 

Massive IAS transfers in Telangana

పబ్లిక్ సర్వీస్ కమిషన్
కార్యదర్శిగా అనితారామచంద్రన్
పంచాయతీరాజ్ కమిషనర్‌గా శరత్
పరిశ్రమల శాఖ సంచాలకులుగా కృష్ణభాస్కర్
పలు జిల్లాల కలెక్టర్లు బదిలీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ కలెక్టర్ జితీష్ పటేల్‌ను కామారెడ్డి కలెక్టర్‌గా బదిలీ చేసింది. జనగాం కలెక్టర్ నిఖిలాను వికారాబాద్ కలెక్టర్‌గా, ఖమ్మం కమిషనర్ అనురాగ్ జయంతిని సిరిసిల్ల కలెక్టర్‌గా, రామగుండం కమీషనర్ ఉయదభాస్కర్‌ను నాగరకర్నూల్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. కరీంనగర కమిషనర్ వల్లూరి క్రాంతిని గద్వాల్ కలెక్టర్‌గా, డి ప్యూటి సెక్రటరి శివలింగయ్యను జనగాం కలెక్టర్‌గా బ దిలీ చేసింది. నిజాంపేట్ కమిషనర్ గోపిని వరంగల్ కలెక్టర్‌గా, వెయిటింగ్‌లో ఉన్న కె.శశాంక్‌ను మహబూబ్ నగర్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరితో అనితా రామచంద్రన్‌ను పబ్లిక్ సర్వీస్ క మిషసన్ సెక్రటరిగా బదిలీ చేసింది. కామారెడ్డి కలెక్టర్ శరత్‌ను పంచాయతీరాజ్ శాఖ కమీషనర్‌గా బదిలీ చేసిం ది. పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ రఘునందన్ రావును వ్యవసాయశాఖ కార్యదర్శిగా నియమించింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. వి.వెంకటేశ్వర్లును యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. మహమ్మద్ అబ్దుల్ అజీమ్‌ను మైనారిటీ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా నియమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News