Friday, May 3, 2024

వచ్చేనండీ.. కిసాన్ బండీ

- Advertisement -
- Advertisement -

Farmers

 

న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆదిశగా ముందడుగు వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులకు మేలు చేసే అనేక చర్యలను ప్రకటించారు. 2020- 21 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్షాన్ని రూ.15 లక్షల కోట్లకు పెంచడంతో పాటుగా, కిసాన్ రైలు, కృషి ఉడాన్ లాంటి పథకాలను కూడా ప్రకటించారు. బడ్జెట్ థీమ్స్‌లో ఆకాంక్ష, ఆర్థికాభివృద్ధి, సంక్షేమం ఇవే ప్రధానమైనవని ఆర్థిక మంత్రి చెబుతూ, మొదటి ఆకాంక్షలో భాగంగా నైపుణ్యాలు, విద్య, వ్యవసాయం ఉంటాయని చెప్పారు. పండ్లు, కూరగాయలు లాంటి వాటి రవాణాకు రిఫ్రిజిరేటెడ్ పార్సిల్ వ్యాన్లను ఉపయోగించాలనే ఆలోచనను 2009 10 రైల్వే బడ్జెట్‌లో అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ తొలిసారిగా ప్రకటించారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలాగే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్షా ఉత్థాన్ మహాభియాన్ (పిఎం కుసుమ్)ను మరింత విస్తరించనున్నట్లు కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. వ్యవసాయానికి సంబంధించి మూడు కొత్త చట్టాలను తీసుకు రానున్నట్లు కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రధానంగా వ్యవసాయాభివృద్ధికి 16 అంశాలు కార్యాచరణను ప్రకటించారు.

పండ్లు, కూరగాయలు, పూలు లాంటి త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడం కోసం భారతీయ రైల్వే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో కిసాన్ రైలును ఏర్పాటు చేస్తుంది.
కూరగాయల సరఫరా కోసం కృషి ఉడాన్ యోజన, వాటి రవాణా కోసం ప్రత్యేక విమానాల వినియోగం
రైతులకు 20 లక్షల సోలార్ పంపుసెట్ల సరఫరా, బీడు భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఆర్థిక సాయం
రసాయనిక ఎరువులనుంచి రైతులకు విముక్తి, భూసార పరిరక్షణకు అదనపు సహాయం, సంస్కరణలు
రైతులకు సహాయంగా గిడ్డంగుల నిర్మాణం, గిడ్డంగుల నిర్మాణానికి నాబార్డ్ ద్వారా రుణం,
పిపిపి పద్ధతిలో ఎఫ్‌సిఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గిడ్డంగుల నిర్మాణం
వర్షాభావ జిల్లాలకు అదనంగా నిధులు, సాగునీటి సౌకర్యం
ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నాబార్డ్ ద్వారా ఎన్‌ఎస్‌జిలకు సాయం
ఉద్యానవన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం. ప్రత్యేక క్లస్టర్ల ఏర్పాటు
కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఉద్యానవన పంటలకు అదనపు నిధుల కేటాయింపు
పాల ఉత్పత్తుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి
రానున్న ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్షం రూ.15 లక్షల కోట్లు
3,400 సాగర మిత్రల ఏర్పాటు
గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలకు రూ.2.83 లక్షల కోట్లు
ఆల్గే, సివి కేజ్ విధానంలో మత్స పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహకాలు
కోస్తా ప్రాంతాల్లోని యువతకు మత్స పరిశ్రమలో మరింత ఉపాధి కల్పన

పిఎం కిసాన్‌కు 27.5 శాతం కోత

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.70 వేలకు బదులుగా రూ.54,370.15 కోట్లను మాత్రమే కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు బడ్జెట్ పత్రాలను బట్టి తెలుస్తోంది. పిఎం కిసాన్ పథకానికి కేటాయింపులను తగ్గించినప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద బడ్జెట్ అంచనాను మాత్రం అదే స్థాయిలో రూ.75,000గానే ఉంచింది. ఏడాదికి మూడు విడతల్లో రైతుకు రూ.6 వేల ఆర్థిక సాయం అందించడానికి ఉద్దేశించిన ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు 6 కోట్లకు పైగా రైతులకు రూ.43,000 కోట్లకు పైగా పంపిణీ చేసింది. పశ్చిమ బెంగాల్ లాంటి కొన్ని రాష్ట్రాలు ఈ పథకంలో చేరకపోవడం, అలాగే చాలా రాష్ట్రాల వద్ద రైతులకు సంబంధించి సరయిన డాటా లేకపోవడం వల్ల సవరించిన బడ్జెట్ అంచనాల్లో ఈ పథకానికి కేటాయింపులను తగ్గించినట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా లబ్ధి పొందే రైతుల సంఖ్య అంచనాను కూడా ఇంతకు ముందు అంచనా వేసిన 14.5 కోట్ల మందినుంచి 14 కోట్లకు తగ్గించారు.

Measures to Benefit Farmers in Budget
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News