Sunday, April 28, 2024

అంతరిక్ష ఉల్కల్లో డిఎన్‌ఎ, ఆర్‌ఎన్‌ఎ మూలాలు

- Advertisement -
- Advertisement -

జీవికి కావలసిన చాలా మూలకాలు ఉల్కల్లో కనిపిస్తున్నాయి. గత శతాబ్దంలో అంతరిక్షం నుంచి భూమిపైకి ఊడిపడిన శిలల్లో ఐదు జీవాధారాలు కనిపించాయి. అవి డిఎన్‌ఎ, ఆర్‌ఎన్‌ఎలో సమాచారాన్ని ఈ శిలలు భద్రపరిచాయి. ఈ వివరాలను నేచర్ కమ్యూనికేషన్ మేగజైన్ ఏప్రిల్ 26లో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మూలాధారాలను “న్యూక్లియోబేసిస్‌”గా వ్యవహరిస్తారు. అవే ఎడెనైన్, క్యానైన్, సైటోసిన్, థైమిన్, యురేసిల్. ఇవి భూమిపై ఉన్న జీవకోటిలో జన్యుసంకేతాన్ని (జెటిటిక్ కోడ్ )తయారు చేయడానికి సుగర్స్, ఫాస్ఫేట్స్‌తో ఏకమవుతుంటాయి. ఈ జీవాధార మూలకాలు మొట్టమొదట అంతరిక్షం నుంచి సంక్రమించాయా? లేక భూమిపై రసాయన చర్యల వల్ల వెచ్చని నురగ నుంచి వచ్చాయా అన్నది ఇంకా తెలియడం లేదు. కానీ ఇప్పటి పరిశోధన జీవి పూర్వగాములు వాస్తవానికి అంతరిక్షం నుంచే వచ్చారనడానికి తగిన సాక్షాధారాన్ని అందించిందని పరిశోధకులు చెబుతున్నారు.

1960 నుంచి శాస్త్రవేత్తలు ఎడెనైన్, క్యానైన్, ఇతర సేంద్రియ సమ్మేళనాలను తునకలుగా ఉల్కల్లో కనుగొంటున్నారు. కానీ సైటోసిన్ మాత్రం ఇంతవరకు అంతుచిక్కడం లేదు. ఇప్పుడు భూమిపై జీవుల్లో ఉండే డిఎన్‌ఎ, ఆర్‌ఎన్‌ఎ లోని జీవాధారాల పొందిక అంతా ఉల్కల్లో ప్రత్యక్షం కావడం పూర్తిగా కనుగొనగలిగామని గ్రీన్‌బెల్ట్ లోని నాసాకు చెందిన గొడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఆస్ట్రోకెమిస్ట్ డేనియల్ గ్లావిన్ స్పష్టం చేశారు. కొన్నేళ్ల క్రితం జపాన్ సపోరో లోని హొక్కైడో యూనివర్శిటీకి చెందిన జియోకెమిస్ట్ యసుహిరో ఒబా అతని సహచర శాస్త్రవేత్తలు ఉల్కల దుమ్ము ద్రవం లోని వివిధ రసాయన మూలకాలను వడపోసి వేరు చేసి విశ్లేషించారు. ఇదివరకటి అధ్యయనాల కన్నా తమ అధ్యయనం ఎంతో సున్నితమైనదని ఒబా పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం పరిశోధకులు అదే ప్రక్రియలో రైబోస్‌ను కనుగొన్నారు. రైబోస్ అంటే జీవికి అవసరమయ్యే సుగర్. దీన్ని మూడు ఉల్కల్లో కనుగొన్నారు. అయితే కొత్త అధ్యయనంలో ఒబా అతని సహచరులు నాసా ఖగోళ రసాయన శాస్త్రవేత్తలతో కలిసి ఆ మూడు ఉల్కల నమూనాల్లో ఒకదానిలోను, అదనంగా మరికొన్ని ఉల్కల నమూనాల్లోను జీవాధారమైన మరొక కీలక మూలకం “న్యూక్లియోబేసిస్‌” గురించి పరిశోధనలు చేపట్టారు. దీనికోసం మామూలుగా వాడే యాసిడ్ కన్నా చల్లటి నీటినే వినియోగించి వడబోత చేపట్టారు. దీంతో మూలకాలన్నీ బయటపడ్డాయి.

కొన్ని దశాబ్దాల క్రితం ఆస్ట్రేలియా, కెంటుకీ, కొలంబియా ప్రాంతాల్లో లభ్యమైన ఉల్కల నమూనాలు నాలుగింటి నుంచి మూలకాలను సమృద్ధిగా కనుగొనగలిగారు. ఇదే ప్రక్రియ ఉపయోగించి పరిశోధకులు ఆస్ట్రేలియా నేల నుంచి సేకరించిన రసాయన మూలకాలతో ఉల్కల నమూనాల మూలకాలతో పోల్చిచూశారు. పరిసరాల మట్టినుంచి వెలువడిన వాటి కన్నా ఉల్కల నమూనాల మూలకాలే గొప్పగా ఉన్నాయని తేలింది. దీన్ని బట్టి మూలకాలు ఈ అంతరిక్ష శిలల నుంచి భూమికి వచ్చాయని నిర్ధారణ అయింది. కానీ సైటోసైన్, యురేసిల్ వంటి ఇతర మూలకాలు ఉల్కల్లో కన్నా 20 రెట్లు ఎక్కువగా నేలలోనే కనిపించాయి. ఇది భూసంబంధ కాలుష్యాన్ని సూచిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News