Monday, October 14, 2024

ద‌ళితుల జీవితాల్లో వెలుగునింపేందుకే ద‌ళిత బంధు: మంత్రి అల్లోల

- Advertisement -
- Advertisement -

Milk shower to CM KCR photo in Nirmal

నిర్మ‌ల్: దళితుల అభ్యున్న‌తి కోసం తెలంగాణ దళిత బంధు పథకం అమ‌లు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటానికి అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, టిఆర్ఎస్ ఎస్సీ సెల్ నేత‌లు పాలాభిషేకం చేశారు. ప‌ట్ణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా సిఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌తోనే దళితుల అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. దళితుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు. గ‌తంలో ఇచ్చిన హమీల‌ను ఒక్కోక్క‌టిగా నెర‌వేరుస్తున్నార‌ని, ఈ క్ర‌మంలోనే తెలంగాణ ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి ..ఒక్కో లబ్ధిదారుకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నార‌ని పేర్కొన్నారు. 75 ఏళ్ళ స్వతంత్ర భారతావ‌నిలో ద‌ళిత వాడ‌లు ఇంకా అలాగే ఉన్నాయని, అయితే వారి జీవితాల్లో పెద్ద‌గా మార్పు రాలేద‌న్నారు. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం ఎన్నో ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌ని చెప్పారు. డా.బీఆర్ అంబేడ్క‌ర్ ఆశ‌య సాధ‌న కోసం ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు కృషి చేస్తున్నార‌ని తెలిపారు. నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాలోకే రూ.10 ల‌క్ష‌ల జ‌మా అవుతుండ‌టంతో ద‌ళిత కుటుంబాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయ‌న్నారు. అయితే ఇది ఎన్నిక‌ల స్టంట్ అని విమ‌ర్శ‌లు చేసిన విపక్ష నేత‌లు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని మంత్రి ప్రశ్నించారు.

Milk shower to CM KCR photo in Nirmal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News