Wednesday, May 1, 2024

రెడ్ జోన్‌లో పనిచేస్తున్న సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని అంచనా వేసేందుకు ఏర్పాటు చేసిన రెడ్‌జోన్‌లో పనిచేస్తున్న సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ఆయుష్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో బిఆర్‌కే భవన్‌లో ఏర్పాటు చేసిన ఆయుర్వేద రక్షణకిట్లు పంపిణి కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ జాయింట్ సిపి విశ్వప్రసాద్, ఐపిఎస్ బాలనాగాదేవి, ఐజిపి హోమ్ గార్డ్‌లకు మంత్రి ఈ కిట్లను అందించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాణాలకు పణంగా పెట్టి రెడ్‌జోన్‌లో పనిచేస్తున్న పోలిస్, వైద్య, మున్సిపల్ సిబ్బందికి మొదటి దఫా 20 వేల కిట్లను పంపిణి చేశామన్నారు. ఆయుర్వేద అనేది చాలా ప్రాచీనమైన వైద్యంశాస్త్రమని, ఆయుష్ డిపార్ట్‌మెంట్ ఆధర్వంలో ఐదు రకాల మందులతో ఈ కిట్లను తయారు చేశారని మంత్రి తెలిపారు. ఈ కిట్లను తయారు చేసినందుకు కమిషనర్ అలుగు వర్షిణిని, వారి టీంని అభినందిస్తున్నానని మంత్రి తెలిపారు.

ప్రపంచానికి ఆయుర్వేద వైద్యం అందించిన చరిత్ర భారతదేశానిదని, ప్రపంచ దేశాలతో పోల్చితే భారత దేశం కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వలనే వైరస్ వ్యాప్తి, మరణాల రేట్ చాలా తక్కువగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ అనసూయ, ప్రిన్సిపల్ సూర్యప్రకాష్, సూపరింటెండెంట్ పరమేశ్వర్, డ్రగ్ టెస్టింగ్ ల్యాబరేటరి డైరెక్టర్ శ్రీనివాసచారి, ఫార్మాసీ సూపరింటెండెండ్ డా శ్రీధర్, ఫ్రో కెసి డా శ్రీకాంత్‌బాబు, కేంద్ర ఆయుర్వేద రీసెర్చ్ కౌన్సిల్ అధికారి డా సాకేత్ రాం. నోడల్ ఆఫీసర్ డా ప్రవీణ్‌కుమార్, విశ్వ ఆయుర్వేద పరిషత్ నేషనల్ సెక్రటరి డా ప్రేమనందరావు, డా సురేష్ జకోటియ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News